శివగిరి తీర్థయాత్ర 90వ వార్షికోత్సవం, బ్రహ్మ విద్యాలయ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 26th, 10:31 am

శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ అధ్యక్షులు స్వామి సచ్చిదానంద గారు, ప్రధాన కార్యదర్శి స్వామి రితంభరానంద గారు, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు మరియు కేరళ ముద్దు బిడ్డలు శ్రీ వి. మురళీధరన్ గారు మరియు రాజీవ్ చంద్రశేఖర్ గారు, శ్రీ నారాయణ గురు ధర్మ సంఘం ట్రస్ట్ అధికారులు, దేశవిదేశాల నుండి వచ్చిన భక్తులందరూ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్,

శివగిరి తీర్థయాత్ర 90వ వార్షికోత్సవం మరియు బ్రహ్మ విద్యాలయ యొక్కస్వర్ణోత్సవం సందర్బం లో సంవత్సరం పొడవునా నిర్వహించేటటువంటి సంయుక్త కార్యక్రమంతాలూకు ప్రారంభోత్సవం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

April 26th, 10:30 am

శివగిరి తీర్థం యొక్క 90వ వార్షికోత్సవం మరియు బ్రహ్మ విద్యాలయం యొక్క స్వర్ణోత్సవం సందర్భం లో ఏడాది పొడవునా నిర్వహించేటటువంటి సంయుక్త కార్యక్రమాల కు సంబంధించి ఈ రోజున 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో జరిగిన ప్రారంభోత్సవం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. ఆయన ఏడాది పొడవునా సాగేటటువంటి సంయుక్త ఉత్సవానికి సూచకం గా ఒక గుర్తింపు చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు. శివగిరి తీర్థయాత్ర, ఇంకా బ్రహ్మ విద్యాలయం.. ఈ రెండూ కూడా మహా సామాజిక సంస్కరణవాది శ్రీ నారాయణ గురు యొక్క ఆశీర్వాదం మరియు మార్గదర్శనం లో ఆరంభం అయ్యాయి. ఈ సందర్భం లో శివగిరి మఠాని కి చెందిన ఆధ్యాత్మిక నేత లు, భక్తుల కు తోడు కేంద్ర మంత్రులు శ్రీయుతులు రాజీవ్ చంద్రశేఖర్, వి. మురళీధరన్ లు, ఇతరులు పాల్గొన్నారు.

శివగిరి తీర్థయాత్ర 90వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నందున మీ ఇన్‌పుట్‌లను పంచుకోండి

April 25th, 01:13 pm

శివగిరి తీర్థయాత్ర 90వ వార్షికోత్సవం, బ్రహ్మ విద్యాలయ స్వర్ణోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. శివగిరి మఠం శివగిరి తీర్థయాత్ర 'నవతి' మరియు బ్రహ్మ విద్యాలయ స్వర్ణోత్సవాల కోసం సంయుక్తంగా ఏప్రిల్, 2022 నుండి ఒక సంవత్సరం పాటు కార్యక్రమాన్ని జరుపుకుంటుంది.