త్రిస్సూర్ లోని శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

April 25th, 09:21 pm

త్రిస్సూర్ పూరం పండుగ సందర్భంగా కేరళ, త్రిస్సూర్ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. కేరళ సాంస్కృతిక రాజధానిగా త్రిసూర్ కు పేరుంది. సంస్కృతి ఉన్నచోట సంప్రదాయాలు, కళలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికతతో పాటు తత్వశాస్త్రం కూడా ఉంది. పండుగలతో పాటు ఉల్లాసం కూడా ఉంది. త్రిస్సూర్ ఈ వారసత్వాన్ని, అస్తిత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. శ్రీసీతారామస్వామి ఆలయం కొన్నేళ్లుగా ఈ దిశగా డైనమిక్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఆలయాన్ని ఇప్పుడు మరింత దివ్యంగా, వైభవంగా తీర్చిదిద్దినట్లు తెలిసింది. ఈ సందర్భంగా శ్రీసీతారామ, అయ్యప్పస్వామి, శివుడికి కూడా బంగారు పూత పూసిన గర్భగుడిని అంకితం చేస్తున్నారు.

కేరళ లోని త్రిశూర్ లో శ్రీ సీతారామ స్వామి ఆలయం సంబంధి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

April 25th, 09:20 pm

త్రిశూర్ లో గల శ్రీ సీతారామ స్వామి ఆలయం లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు. మంగళప్రదం అయినటువంటి త్రిశూర్ పూరమ్ ఉత్సవం తాలూకు సందర్భం లో అందరికీ ఆయన అభినందనల ను తెలియ జేశారు.

భారత్ పరిక్రమ పాదయాత్ర ను విజయవంతంగా ముగించుకొన్న అనంతరం ప్రధాన మంత్రి తో భేటీ అయిన శ్రీ సీతారామ్ కేదిలాయ

August 11th, 06:01 pm

శ్రీ సీతారామ్ కేదిలాయ తాను చేపట్టిన భారత్ పరిక్రమ పాదయాత్ర ను విజయవంతంగా ముగించుకొన్న అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు భేటీ అయ్యారు.