మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోగల శ్రీ సద్గురు సేవాసంఘ్ ట్రస్టులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
October 27th, 07:57 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోగల శ్రీ సద్గురు సేవాసంఘ్ ట్రస్టులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీర్ మందిరంలో ఆయన దైవదర్శనం చేసుకుని, పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రణ్‌ఛోడ్‌దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి శ్రీరామ సంస్కృత మహా విద్యాలయానికి వెళ్లి, గురుకుల కార్యక్రమాల గ్యాలరీని తిలకించారు. అనంతరం సద్గురు నేత్ర చికిత్సాలయను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను కూడా తిలకించారు. అటుపైన సద్గురు వైద్యనగరం నమూనాను ప్రధాని పరిశీలించారు.నేడు (అక్టోబర్ 27) ప్రధాన మంత్రి మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ సందర్శన
October 26th, 09:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు (అక్టోబర్ 27న) మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు, ప్రధానమంత్రి సత్నా జిల్లా చిత్రకూట్ కు చేరుకుంటారు. శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్‌లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. రఘుబీర్ మందిర్‌లో మూర్తి దర్శనం, పూజలు చేస్తారు. శ్రీ రామ్ సంస్కృత మహావిద్యాలయాన్ని సందర్శిస్తారు. స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించి, జానకి కుండ్ చికిత్సాలయ నూతన విభాగాన్ని ప్రారంభిస్తారు.