శ్రీ హర్మోహన్ సింగ్ యాదవ్ 10వ పుణ్యతిథి సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

July 25th, 04:31 pm

దివంగత హర్మోహన్ సింగ్ యాదవ్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా గౌరవపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఇంత ఆప్యాయంగా ఆహ్వానించినందుకు సుఖరామ్ జీకి కూడా కృతజ్ఞతలు. అంతేకాదు, మీ అందరి మధ్య ఉండే ఈ కార్యక్రమానికి కాన్పూర్ రావాలని నా కోరిక. కానీ నేడు, ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి కూడా ఒక పెద్ద సందర్భం. ఈరోజు మన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా గిరిజన సమాజానికి చెందిన మహిళా అధ్యక్షురాలు దేశానికి నాయకత్వం వహించబోతున్నారు. ఇది మన ప్రజాస్వామ్య శక్తికి మరియు అందరినీ కలుపుకుపోవడానికి సజీవ ఉదాహరణ. ఈ సందర్భంగా ఇవాళ ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ బాధ్యతల కోసం నేను ఢిల్లీలో ఉండటం చాలా సహజమైనది మరియు అవసరం కూడా. అందుకే, నేను ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మీతో చేరుతున్నాను.

దివంగ‌త హ‌ర్ మోహ‌న్ సింగ్‌యాద‌వ్ 10 వ పుణ్య‌తిథి సంద‌ర్భంగా జ‌రిగిన‌కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి

July 25th, 04:30 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ దివంగ‌త శ్రీ హ‌ర్ మోహ‌న్ సింగ్ యాద‌వ్ 10 వ పుణ్య‌తిథి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. హ‌ర్ మోహ‌న్ సింగ్ పార్ల‌మెంటు మాజీ స‌భ్యుడు, ఎం.ఎల్‌.సి, ఎం.ఎల్‌.ఎ, శౌర్య‌చ‌క్ర అవార్డు గ్ర‌హీత‌, యాద‌వ క‌మ్యూనిటీ నాయ‌కులు కూడా.

కీర్తిశేషుడు శ్రీ హర్ మోహన్ సింహ్ యాదవ్ పదో వర్ధంతి సూచకం గా జులై 25న ఏర్పాటు చేసినకార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

July 24th, 02:55 pm

కీర్తి శేషుడు శ్రీ హర్ మోహన్ సింహ్ యాదవ్ పదో వర్ధంతి సూచకం గా జులై 25న ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రోజు న సాయంత్రం 4 గంటల 30 నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.