మైసూరు లో రైల్వే ప్రాజెక్టుల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; శ్రావ‌ణ‌బెళ‌గోళ లో అభివృద్ధి ప‌నుల‌ను కూడా ఆయ‌న ప్రారంభించారు

February 19th, 03:44 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మైసూరు మ‌రియు కెఎస్ఆర్‌ బెంగ‌ళూరు ల మ‌ధ్య విద్యుద్దీకరణ జరిగిన రైలు మార్గాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు ఈ రోజు అంకితం చేశారు. మైసూరు రైల్వే స్టేష‌న్ లో ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాలుపంచుకొని, మైసూరు మ‌రియు ఉద‌య్‌పూర్ మ‌ధ్య రాక‌పోక‌లు జ‌రిపే ప్యాలెస్ క్వీన్ హ‌మ్‌స‌ఫ‌ర్ ఎక్స్‌ప్రెస్ కు ప‌చ్చ జెండాను చూపి ఆ రైలును ప్రారంభించారు.

కర్నాటకలో బాహుబలి మహామస్తకాభిషేక మహోత్సవంలో ప్రసంగించిన ప్రధాని

February 19th, 02:45 pm

భారతదేశంలోని సాధువులు ఎల్లప్పుడూ సమాజం కోసం పనిచేసి, ఒక సానుకూల మార్పు తీసుకువచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. “మనము ఎల్లప్పుడూ సమయంతో పరివర్తన చెందడం మరియు కొత్త విషయాలకు అలవాటు పాడడం మన సమాజం యొక్క బలం” అని కూడా అన్నారు. ఆయుష్మన్ భారత్ యోజన గురించి మాట్లాడుతూ, పేదలకు మంచి నాణ్యమైన మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణ అందించడం మా బాధ్యత. అని అన్నారు.