ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
December 04th, 12:35 pm
ఉత్తరాఖండ్‌లోని గౌరవనీయులైన పెద్దలు, సోదరీమణులు, అక్కాచెల్లెళ్లు, సోదరులు మరియు సోదరీమణులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. మీరు కుశలమని ఆశిస్తున్నాను. దయచేసి నా శుభాకాంక్షలను అంగీకరించండి.డెహ్రాడూన్‌లో దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన - ప్రధాన మంత్రి
December 04th, 12:34 pm
ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా నెలకొన్న కొండచరియల సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రయాణాన్ని సురక్షితం చేయడంపై దృష్టి సారించే ఏడు ప్రాజెక్టులను; దేవప్రయాగ నుండి శ్రీకోట్ వరకు అదేవిధంగా జాతీయ రహదారి ఎన్.హెచ్-58 పై బ్రహ్మపురి నుంచి కొడియాల వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు; యమునా నదిపై నిర్మించిన 120 మెగా వాట్ల వ్యాసి జల విద్యుత్ ప్రాజెక్టు; డెహ్రాడూన్ లో హిమాలయ సాంస్కృతిక కేంద్రం; డెహ్రాడూన్‌లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ పెర్ఫ్యూమరీ అండ్ అరోమా లాబొరేటరీ (సుగంధ మొక్కల కేంద్రం) ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.డిసెంబర్4న దేహ్ రాదూన్ లో అనేక పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిపథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధాన మంత్రి; ఈ పథకాల విలువ సుమారు 18,000 కోట్ల రూపాయలు
December 01st, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 4 వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో దేహ్ రాదూన్ లో పర్యటించనున్నారు. దాదాపు గా 18,000 కోట్ల రూపాయల వ్యయం కలిగిన పలు ప్రాజెక్టుల లో కొన్నిటిని ఆయన ప్రారంభించి మరి కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమైన రహదారుల కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం పై ఈ పర్యటన కాలం లో శ్రద్ధ తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు లు ప్రయాణాన్ని సాఫీ గా, సురక్షితం గా మలచగలవు. అంతేకాదు, ఈ ప్రాంతం లో పర్యటన అవకాశాల ను కూడా పెంచగలవు. ఒకప్పుడు చేరుకోవడం కష్టం అని భావించిన మారుమూల ప్రాంతాల కు సంధానం సౌకర్యాన్ని పెంచాలన్న మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ ప్రాజెక్టు లు ఉన్నాయి.