ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు నాలుగో దశ విస్తరణ రిథాలా-కుండ్లీ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం
December 06th, 08:08 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో భాగంగా నాలుగోదశకు చెందిన 26.463 కిలోమీటర్ల రిథాలా - నరేలా - నాథూపూర్ (కుండ్లి) కారిడార్‌కు ఆమోదం తెలిపింది. ఇది దేశ రాజధాని, పొరుగున ఉన్న హర్యానా మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మంజూరు చేసిన తేదీ నుంచి 4 సంవత్సరాలలో ఈ కారిడార్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు.