
India - New Zealand Joint Statement
March 17th, 02:39 pm
PM Modi held bilateral talks with New Zealand PM Luxon in New Delhi. Both leaders agreed to cooperate closely in perse areas, including trade and investment, defence and security, education and research, science and technology, agri-tech, space, mobility of people and sports.
మారిషస్ ప్రధానమంత్రి తన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 12th, 06:15 am
గౌరవనీయ మారిషస్ ప్రధానమంత్రి శ్రీ నవీన్ చంద్ర రాంగూలాం, శ్రీమతి వీణా రాంగూలాం, ఉప ప్రధానమంత్రి శ్రీ పాల్ బెరెంజే గార్లూ, గౌరవనీయ మంత్రులూ, సోదర సోదరీమణులు అందరికీ నమస్కారం, బాన్ జూర్!
మారిషస్‌లోని భారతీయులతో సమావేశంలోప్రధానమంత్రి ప్రసంగం
March 12th, 06:07 am
పదేళ్ల కిందట ఇదే తేదీన నేను మారిషస్ పర్యటనకు వచ్చేనాటికి ఓ వారం ముందే మేం హోలీ పండుగ చేసుకున్నాం. అప్పుడు భారత్ నుంచి హోలీ వేడుకల సంరంభాన్ని నాతో మోసుకొచ్చాను. అయితే, ఈసారి వర్ణరంజిత హోలీ సంరంభాన్ని మారిషస్ నుంచి మన దేశానికి తీసుకెళ్తాను. ఈ నెల 14వ తేదీన హోలీ కాబట్టి.. వేడుకలకు మరొక రోజు మాత్రమే ఉంది.మారిషస్‌లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 11th, 07:30 pm
మారిషస్ ప్రధాని శ్రీ నవీన్ చంద్ర రాంగులాంతో పాటు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్‌లోని ట్రాయోన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని, ఇండియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తినిపుణులు, సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు సహా భారతీయ ప్రవాసులు చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మారిషస్ మంత్రులు అనేక మందితోపాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సీఐఎస్ఎఫ్ సంస్థాపన దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రధానమంత్రి అభినందనలు
March 10th, 06:55 pm
ఈ రోజు సీఐఎస్ఎఫ్ సంస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంస్థ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకిత భావం, ధైర్య సాహసాలకి సీఐఎస్ఎఫ్ దళం పెట్టింది పేరని ప్రధాని ప్రశంసించారు. “ఈ దళాల వారు ప్రతి రోజూ అసంఖ్యాక ప్రజలను, కీలక సదుపాయాలను కాపాడుతూ దేశ భద్రతలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తమ బాధ్యతను క్షణం కూడా మరువని వీరి అంకితభావం శ్లాఘనీయం” అని ప్రధానమంత్రి కొనియాడారు.మార్చి 11-12, 2025 వరకు మారిషస్‌ను సందర్శించనున్న ప్రధాని మోదీ
March 07th, 06:17 pm
ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులం ఆహ్వానం మేరకు మార్చి 11-12 తేదీల్లో ప్రధాని మోదీ మారిషస్‌ను సందర్శిస్తారు. ఈ పర్యటనలో, ఆయన కీలక నాయకులను కలుస్తారు, భారత సంతతి సమాజంతో సన్నిహితంగా ఉంటారు మరియు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉమ్మడి చరిత్ర మరియు పురోగతిలో పాతుకుపోయిన బలమైన భారతదేశం-మారిషస్ భాగస్వామ్యాన్ని ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది.రిపబ్లిక్ ప్లీనరీ సదస్సులో ప్రధాని ప్రసంగం
March 06th, 08:05 pm
మీరంతా అలసిపోయి ఉంటారు.. అర్నబ్ గొంతు వినీవినీ మీ చెవులూ అలసిపోయుంటాయి. కూర్చో అర్నబ్.. ఇంకా ఎన్నికల సీజన్ మొదలవలేదు. ముందుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన రిపబ్లిక్ టీవీకి శుభాకాంక్షలు. ఇంత పెద్ద పోటీని నిర్వహించి క్షేత్రస్థాయిలో యువతను భాగస్వాములను చేయడం ద్వారా వీరందరినీ మీరిక్కడికి తీసుకొచ్చారు. జాతీయ స్థాయి చర్చల్లో యువత భాగస్వామ్యం ఆలోచనల్లో కొత్తదనాన్ని రేకెత్తిస్తుంది. అది వ్యవస్థలో నవోత్తేజాన్ని నింపుతుంది. దాన్నే మనమిప్పుడు ఇక్కడ ఆస్వాదిస్తున్నాం. ఓ రకంగా యువత భాగస్వామ్యంతో బంధనాలన్నింటినీ విచ్ఛిన్నం చేయగలం, హద్దులకు అతీతంగా విస్తరించ గలం. దానితో అసాధ్యమైన లక్ష్యమంటూ ఏదీ ఉండదు. చేరుకోలేని గమ్యమంటూ ఏదీ లేదు. ఈ సదస్సు కోసం రిపబ్లిక్ టీవీ కొత్త ఆలోచనలతో పనిచేసింది. ఈ కార్యక్రమం విజయవంతమవడం పట్ల మీ అందరికీ అభినందనలు. మీకు నా శుభాకాంక్షలు. ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది. ఒకటి- నేను కొన్ని రోజులుగా లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఆ లక్ష మందీ కూడా తమ కుటుంబాల్లో రాజకీయాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తులై ఉండాలి. కాబట్టి ఓ రకంగా ఇలాంటి కార్యక్రమాలు నా లక్ష్య సాధనకు రంగం సిద్ధం చేస్తున్నాయి. రెండు- వ్యక్తిగతంగా నాకో ప్రయోజనముంది. అదేమిటంటే 2029లో ఓటు వేయబోతున్న వారికి 2014కు ముందు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో ఏ అంశాలుండేవో తెలియదు. పదీ పన్నెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగేవని వారికి తెలియదు. 2029లో ఓటు వేసే సమయానికి.. గతంతో పోల్చి చూసుకునే సదుపాయం వారికి ఉండదు. ఆ పరీక్షలో నేను పాసవ్వాలి. ఆ దిశగా యువతను సన్నద్ధులను చేసేలా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు మా ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తాయన్న విశ్వాసం నాకుంది.PM Modi addresses Republic Plenary Summit 2025
March 06th, 08:00 pm
PM Modi addressed the Republic Plenary Summit in Delhi. Shri Modi highlighted that the world is now recognising this century as India's century and the country's achievements and successes have sparked new hope globally. He stated that India, once perceived as a nation that would sink itself and others, is now driving global growth.‘India’s Defence Transformation is a Testament to Self-Reliance and Sovereignty,’ says Rajnath Singh, Minister of Defence
January 31st, 03:38 pm
India’s defence sector has witnessed unprecedented growth and modernisation in recent years, driven by indigenous production, strategic investments, and a renewed focus on self-reliance. From the ₹10,000 crore Pinaka rocket ammunition deal to advanced missile technologies like Agni V MIRV and Pralay, the nation is reinforcing its position as a global military powerhouse.అధ్యక్షుడు శ్రీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంపై అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి పరస్పర లాభదాయక, విశ్వసనీయ భాగస్వామ్యానికి కృషి చేద్దామంటూ నేతల పునరుద్ఘాటన టెక్నాలజీ, వ్యాపారం, పెట్టుబడి, ఇంధనంలతోపాటు రక్షణ రంగాల్లో సహకారంపై చర్చ
January 27th, 10:30 pm
అమెరికా అధ్యక్షుడు శ్రీ ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. శ్రీ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షునిగా ఎన్నికకావడంతోపాటు అమెరికా అధ్యక్షునిగా రెండోసారి గెలిచినందుకు ప్రధాని అభినందనలు తెలిపారు.రెండోసారి అధికారంలోకి అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ వచ్చినందుకు ప్రధానమంత్రి అభినందనలు
January 27th, 08:42 pm
అమెరికా అధ్యక్షునిగా శ్రీ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికై, చరిత్ర సృష్టించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. మన రెండు దేశాలకూ లాభసాటిగా ఉండే, విశ్వసనీయ భాగస్వామ్యాన్ని బలపరచడం కోసం మనం కట్టుబడి ఉన్నాం. మన ప్రజల సంక్షేమానికి, అలాగే ప్రపంచంలో శాంతినీ, సమృద్ధినీ, భద్రతనూ పటిష్టపరచడానికి మనం కలసి పనిచేద్దామని శ్రీ మోదీ అన్నారు.ఇండోనేషియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 25th, 01:00 pm
భారత తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియా మన ముఖ్య అతిథిగా ఉంది. ఇప్పుడు మన 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఇండోనేషియా మరోసారి ఈ చిరస్మరణీయ సందర్భంలో భాగం కావడానికి అంగీకరించడం మాకు చాలా గర్వకారణం. ఈ సందర్భంగా, ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సహా వారి బృందానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
January 15th, 11:08 am
జనవరి 15వ తేదీని సైనిక దినోత్సవంగా జరుపుకొంటాం. దేశాన్ని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి వీర సైనికుడికి నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను, ఈ రోజున భరతమాత రక్షణలో నిమగ్నమైన సైనికులను, మహిళలను నేను అభినందిస్తున్నాను.PM Modi dedicates frontline naval combatants INS Surat, INS Nilgiri & INS Vaghsheer to the nation
January 15th, 10:30 am
PM Modi dedicated three frontline naval combatants, INS Surat, INS Nilgiri and INS Vaghsheer, to the nation on their commissioning at the Naval Dockyard in Mumbai. “It is for the first time that the tri-commissioning of a destroyer, frigate and submarine was being done”, highlighted the Prime Minister. He emphasised that it was also a matter of pride that all three frontline platforms were made in India.ఢిల్లీలోని ప్రతి పౌరుడు చెబుతున్నాడు – ఆప్-దా నహీన్ సాహేంగే...బాదల్ కే రహేంగే: ప్రధాని మోదీ
January 05th, 01:15 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఢిల్లీలోని రోహిణిలో భారీ మరియు ఉత్సాహభరితమైన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు, బిజెపి పాలనలో నగరం యొక్క భవిష్యత్తు కోసం బలవంతపు విజన్‌ను రూపొందించారు. ఒక దశాబ్దం పరిపాలనా వైఫల్యాలకు స్వస్తి పలికి, రాజధానిని గ్లోబల్ మోడల్ ఆఫ్ అర్బన్‌గా మార్చేందుకు డబుల్ ఇంజన్ ప్రభుత్వంకి సాధికారత కల్పించడం ద్వారా సుపరిపాలన శకానికి నాంది పలకాలని జనం నుండి హర్షధ్వానాలతో ప్రధాని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి.ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలని పిఎం మోదీ పిలుపునిచ్చారు, సుపరిపాలన కోసం బిజెపి విజన్‌ను హైలైట్ చేశారు
January 05th, 01:00 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఢిల్లీలోని రోహిణిలో భారీ మరియు ఉత్సాహభరితమైన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు, బిజెపి పాలనలో నగరం యొక్క భవిష్యత్తు కోసం బలవంతపు విజన్‌ను రూపొందించారు. ఒక దశాబ్దం పరిపాలనా వైఫల్యాలకు స్వస్తి పలికి, రాజధానిని గ్లోబల్ మోడల్ ఆఫ్ అర్బన్‌గా మార్చేందుకు డబుల్ ఇంజన్ ప్రభుత్వంకి సాధికారత కల్పించడం ద్వారా సుపరిపాలన శకానికి నాంది పలకాలని జనం నుండి హర్షధ్వానాలతో ప్రధాని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి.జనవరి 4న న్యూఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవ్ – 2025ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
January 03rd, 05:56 pm
గ్రామీణ భారత్ మహోత్సవ్-2025ను జనవరి 4 ఉదయం 10.30గం.ల ప్రాంతంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ఆయన ప్రసంగిస్తారు.సంయుక్త ప్రకటన: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కువైట్ అధికారిక పర్యటన (డిసెంబరు 21-22)
December 22nd, 07:46 pm
గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 21-22 తేదీల్లో కువైట్ ను సందర్శించారు. ఆయన కువైట్ ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ నెల 21న కువైట్ లో జరిగిన 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.కువైట్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
December 22nd, 06:38 pm
రాజకీయాలు, వ్యాపారం, పెట్టుబడి, ఇంధనం, రక్షణ, భద్రత, ఆరోగ్యం, విద్య, టెక్నాలజీ, సాంస్కృతిక సంబంధాలు, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అనేక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చుకోవడానికి ఒక మార్గసూచీని రూపొందించుకోవడంపై నేతలిద్దరూ చర్చించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తృతపర్చుకోవాలని వారు స్పష్టంచేశారు. ఇంధనం, రక్షణ, వైద్య పరికరాలు, ఫార్మా, ఫుడ్ పార్కులు, తదితర రంగాల్లో కొత్త కొత్త అవకాశాలను పరిశీలించడానికి భారతదేశానికి రావాల్సిందిగా కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఇతర ఆసక్తిదారులతో కూడిన ఒక ప్రతినిధివర్గాన్ని ప్రధాని ఆహ్వానించారు. సాంప్రదాయక మందులు, వ్యవసాయ పరిశోధన రంగాల్లో సహకారం అంశాన్ని కూడా నేతలు చర్చించారు. ఆరోగ్యం, శ్రమశక్తి, హైడ్రోకార్బన్ల రంగాల్లో ఇప్పటికే సంయుక్త కార్యాచరణ బృందాలు (జేడబ్ల్యూజీలు) పనిచేస్తుండగా, వీటికి అదనంగా సహకారంపై ఏర్పాటైన సంయుక్త సంఘం (జేసీసీ) పై ఇటీవల సంతకాలు చేయడాన్ని వారు స్వాగతించారు. వ్యాపారం, పెట్టుబడి, విద్య, టెక్నాలజీ, వ్యవసాయం, భద్రతలతో పాటు సాంస్కృతిక రంగాల్లో కొత్తగా జేడబ్ల్యూజీలను ఈ జేసీసీ పరిధిలో ఏర్పాటు చేశారు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ అల్ నహ్యాన్ కు స్వాగతం పలికిన శ్రీ మోదీ
December 12th, 08:44 pm
ఈ రోజు భారత్ కు విచ్చేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ అల్ నహ్యాన్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.