అహ్మదాబాద్ లోని సబర్మతి నదీతీరం -కెవడియా మధ్య సీ ప్లేన్ రాకపోకలను ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 31st, 02:52 pm

అహ్మదాబాద్ లోని కెవడియా వద్ద జల-విమానాశ్రయాన్ని, అక్కడి ఐక్యత విగ్రహం నుండి సబర్మతి నదీ ముఖభాగం వరకు సీ ప్లేన్ సర్వీసులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు. చిట్ట చివరి మైలు రాయి వరకు అనుసంధానం కావాలనే లక్ష్యంలో భాగంగా ఈ జలవిమానాశ్రయాన్ని (వాటర్ ఏరోడ్రోమ్) ఏర్పాటు చేశారు.