ఎస్సీవో తొలి పర్యాటక-సాంస్కృతిక రాజధానిగా వారణాసి

September 16th, 11:50 pm

ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో 2022 సెప్టెంబర్ 16నాటి షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్యదేశాల అధినేతల మండలి 22వ సమావేశం సందర్భంగా 2022-2023 సంవత్సరానికిగాను వారణాసి నగరం ఎస్సీవో తొలి పర్యాటక-సాంస్కృతిక రాజధానిగా ప్రతిపాదించబడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఎస్ సిఒ సమిట్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్యాఖ్యలు

September 16th, 01:30 pm

ప్రస్తుతం, యావత్తు ప్రపంచం మహమ్మారి అనంతరం ఆర్థికం గా పుంజుకోవడం లో సవాళ్ల ను ఎదుర్కొంటున్నప్పుడు, ఎస్ సిఒ యొక్క భూమిక చాలా ముఖ్యమైంది గా మారిపోతుంది. ఎస్ సిఒ సభ్యత్వ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి లో సుమారు 30 శాతాన్ని తామే అందిస్తున్నాయి. మరి ప్రపంచ జనాభా ల 40 శాతం జనాభా నివసిస్తున్నది కూడా ఎస్ సిఒ దేశాల లోనే. ఎస్ సిఒ సభ్యత్వ దేశాల మధ్య మరింత సహకారాన్ని మరియు పరస్పర విశ్వాసాన్ని భారతదేశం సమర్ధిస్తుంది. మహమ్మారి మరియు యూక్రేన్ లో సంకటం ప్రపంచ సరఫరా వ్యవస్థల లో అనేక అడ్డంకుల ను ఏర్పరచాయి. ఈ కారణంగా, యావత్తు ప్రపంచం ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయి లో శక్తి సంబంధి మరియు ఆహారం సంబంధి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మన ప్రాంతం లో ఆధారపడదగ్గ, ఆటుపోటులకు తట్టుకొని నిలబడగలిగిన మరియు వివిధత్వంతో కూడిన సరఫరా వ్యవస్థల ను తప్పక అభివృద్ధి పరచాలి. దీనికి గాను మెరుగైనటువంటి సంధానం అవసరపడుతుంది; అలాగే మనం అందరం ఒక దేశానికి మరొక దేశం గుండా ప్రయాణించడానికి పూర్తి హక్కు ను ఇవ్వడం కూడా ప్రధానం.

ఒక‌రికి మ‌రొక‌రు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకున్న ప్ర‌ధాన మంత్రి మ‌రియు అధ్య‌క్షులు శ్రీ‌ పుతిన్

January 07th, 06:11 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు ర‌ష్యా అధ్య‌క్షులు శ్రీ‌ వ్లాదిమీర్ పుతిన్ లు ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడుకొని, 2019 వ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌ను ప‌ర‌స్ప‌రం అంద‌జేసుకొన్నారు. నేడు ర‌ష్యా లో క్రిస్మ‌స్ ను జ‌రుపుకొంటున్న సంద‌ర్భం గా ప్రెసిడెంటు కు మ‌రియు ర‌ష్యా ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు.

భార‌త‌దేశం మ‌రియు ర‌ష్యా ల మ‌ధ్య లాంఛ‌న‌ప్రాయం కాన‌టువంటి శిఖ‌ర స‌మ్మేళ‌నం

May 21st, 10:10 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, అధ్య‌క్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ లు వారి యొక్క ఒక‌టో లాంఛ‌న‌ప్రాయం కాన‌టువంటి శిఖ‌ర స‌మ్మేళ‌నంలో 2018 మే 21వ తేదీ నాడు ర‌ష్య‌న్ ఫెడ‌రేశ‌న్ లోని సోచీ న‌గ‌రంలో జ‌రిపారు. ఇరువురు నాయ‌కుల‌కు వారి మైత్రి ని గాఢ‌త‌రం చేసుకొనేందుకు మ‌రియు భార‌త‌దేశానికి, ర‌ష్యా కు మ‌ధ్య నెల‌కొన్న ఉన్న‌త‌ స్థాయి రాజ‌కీయ సంబంధ ఆదాన ప్రదానాల సంప్రదాయానికి అనుగుణంగా ప్రాంతీయ అంశాల పట్ల, అంత‌ర్జాతీయ అంశాల ప‌ట్ల ఒక‌రి అభిప్రాయాల‌ను మ‌రొక‌రికి చాటిచెప్పుకొనేందుకు ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నం ఒక అవ‌కాశాన్ని ప్ర‌సాదించింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపిన ప్రధాని మోదీ

May 21st, 04:40 pm

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోచిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరిపారు.