ఫిబ్రవరి 10 వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ ను మరియు మహారాష్ట్ర ను సందర్శించనున్న ప్రధానమంత్రి

February 08th, 05:39 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ ను మరియు మహారాష్ట్ర ను సందర్శించనున్నారు. ఉదయం పూట దాదాపు గా 10 గంటల వేళ లో ప్రధాన మంత్రి లఖ్ నవూ కు చేరుకొని, అక్కడ ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ 2023 ను ప్రారంభిస్తారు. దాదాపు గా 2 గంటల 45 నిమిషాల కు ఆయన ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ లో వందే భారత్ రైళ్ళు రెండిటి కి ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి జెండా ను చూపుతారు. అలాగే రెండు రహదారి పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేస్తారు; ఆ రెండు పథకాల లో ఒకటి సాంతాక్రూఝ్- చెంబూర్ లింక్ రోడ్డు. రెండోది కురార్ అండర్ పాస్ ప్రాజెక్టు. ఆ తరువాత, ఆయన సాయంత్రం పూట దాదాపు గా 4:30 గంటల వేళ లో ముంబయి లోని అల్ జామియా-తుస్-సైఫియా కు చెందిన ఒక కొత్త కేంపస్ ను కూడా ప్రారంభించనున్నారు.