PM Modi delivers impactful addresses in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Maharashtra

November 14th, 02:30 pm

In powerful speeches at public meetings in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.

పుణె లో సంత్ తుకారామ్ జీ కి ప్రార్థనలు జరిపిన ప్రధాన మంత్రి

June 14th, 02:26 pm

పుణె లో సంత్ తుకారామ్ జీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు జరిపారు. సంత్ తుకారామ్ ఆదర్శాలు ఎంతో మంది ప్రజల కు ప్రేరణ ను అందిస్తున్నాయని, అంతేకాకుండా ఆయన ఆదర్శాలుఇతరుల కు సేవ చేసేందుకు, ఒక దయాభరిత సమాజాన్ని పెంచి పోషించేందుకు మనకు స్ఫూర్తి ని ఇస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పంఢర్‌పూర్‌లో జాతీయ రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

November 08th, 03:33 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ థాకరే, నా మంత్రివర్గ సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ నారాయణ్ రాణే, శ్రీ రావుసాహెబ్ దన్వేజీ, శ్రీ రాందాస్ అథవాలే, శ్రీ కపిల్ పాటిల్, డా. భగవత్ కరద్ , డాక్టర్ భారతీ పవార్ జీ, జనరల్ వీకే సింగ్ జీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్ జీ, మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు మరియు నా స్నేహితుడు, శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ జీ, శాసన మండలి స్పీకర్ రామరాజే నాయక్ జీ, మహారాష్ట్ర ప్రభుత్వంలోని గౌరవనీయులైన మంత్రులందరూ, పార్లమెంట్‌లోని నా తోటి ఎంపీలు, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ హాజరైన మీ సాధువులందరూ, మరియు భక్త మిత్రులారా!

వివిధజాతీయ రహదారి మరియు రహదారి పథకాల కుశంకుస్థాపనచేసిన ప్రధాన మంత్రి;మరికొన్ని పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు

November 08th, 03:30 pm

వివిధ జాతీయ రహదారులు మరియు రహదారి పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయడం తో పాటు ఇంకా కొన్ని పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు కూడాను. ఈ కార్యక్రమం లో రహదారి రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి తో పాటు మహారాష్ట్ర గవర్నరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి లు కూడా పాల్గొన్నారు.

నవంబర్ 8న ‘శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ పాల్ఖీ మార్గ్- శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ మార్గ్’ కీలక సెక్షన్ల మధ్య నాలుగు వరుసల రహదారికి ప్రధానమంత్రి శంకుస్థాపన

November 07th, 04:24 pm

పంథర్‌పూర్‌కు భక్తుల రాకపోకల సౌలభ్యం దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబరు 8న ‘శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ఖీ మార్గ్ (ఎన్‌హెచ్‌-965) పరిధిలోని ఐదు విభాగాలు- ‘శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ మార్గ్ (ఎన్‌హెచ్‌-965జి) పరిధిలోని మూడు విభాగాలకు సంబంధించి నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ జాతీయ రహదారుల వెంబడి రెండువైపులా ‘పాల్ఖీ’ కోసం ప్రత్యేక నడక మార్గాలు కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల భక్తుల రాకపోకలకు సురక్షిత-అడ్డంకులు లేని అవాంతరాలు లేని సదుపాయం అందుబాటులోకి వస్తుంది.