సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్‌కు ప్రధాన మంత్రి నివాళులు

October 05th, 02:41 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. సంఘ సంస్కరణకు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి ఆయన దిక్సూచి అని మోదీ కొనియాడారు.

మహారాష్ట్రలోని వాషిమ్‌లో వ్యవసాయ, పశుసంవర్ధక రంగ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం

October 05th, 12:05 pm

మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ గారు.. ప్రముఖ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారు.. కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్.. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంజారా సామాజిక వర్గానికి చెందిన నా సోదరసోదరీమణులు, దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదర సోదరీమణులు.. ఇతర గౌరవనీయులైన ప్రముఖులు, మహారాష్ట్ర సోదర సోదరీమణులారా.. ఈ పవిత్ర భూమి వాషిం నుంచి పోహ్రాదేవికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. నవరాత్రుల సందర్భంగా ఈ రోజు జగదాంబ అమ్మవారి ఆశీస్సులు పొందే భాగ్యం కలిగింది. సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రాంరావ్ మహారాజ్ సమాధిని సందర్శించి వారి ఆశీస్సులు తీసుకున్నాను. ఈ వేదిక మీద నుంచి ఈ ఇద్దరు మహానుభావులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను.

మహారాష్ట్రలోని వాషిమ్‌లో రూ.23,300 కోట్ల విలువైన వ్యవసాయ-పశుసంవర్ధక రంగ కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం

October 05th, 12:01 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలోని వాషిమ్‌లో రూ.23,300 కోట్ల విలువైన వ్యవసాయ-పశుసంవర్ధక రంగ కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘పిఎం-కిసాన్ నిధి’ 18వ విడత నిధుల పంపిణీతోపాటు ‘నమో షేత్కారీ మహాసన్మాన్ నిధి యోజన’ 5వ విడతకు శ్రీకారం చుట్టారు. అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్) కింద 7,500కుపైగా ప్రాజెక్టులను, 9,200 రైతు ఉత్పత్తిదారు సంస్థలు సహా మహారాష్ట్రలో 19 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల అయిదు సౌర పార్కులను దేశానికి అంకితం చేశారు. అంతేకాకుండా పశుగణాభివృద్ధి దిశగా ఏకీకృత జీనోమిక్ చిప్‌తోపాటు జాతి-లింగ ఎంపికపై దేశీయ పశువీర్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధాని ప్రారంభించారు.

అక్టోబర్ 5 న మహారాష్ట్రలో ప్రధానమంత్రి పర్యటన

October 04th, 05:39 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం (అక్టోబర్ 5న) మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఉదయం 11.15 గంటలకు వాసిమ్ చేరుకుని పోహరాదేవి జగదాంబ మాత ఆలయంలో దర్శనం చేసుకుంటారు. వాసిమ్ లోని సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రామ్ రావ్ మహారాజ్ సమాధుల వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు బంజారా సమాజం గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యవసాయ, పశుసంవర్ధక రంగానికి సంబంధించిన సుమారు రూ.23,300 కోట్ల విలువైన పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బీకేసీ మెట్రో స్టేషన్ నుంచి ముంబైలోని ఆరే జేవీఎల్ఆర్ వరకు నడిచే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. బీకేసీ, శాంతాక్రజ్ స్టేషన్ల మధ్య మెట్రోలో శ్రీ మోదీ ప్రయాణం చేయనున్నారు.