మథురలో సంత్ మీరా బాయి 525వ జయంతి సందర్భంగా ప్రధాని ప్రసంగం
November 23rd, 07:00 pm
ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన బ్రజ్ సాధువులు, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, మా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, అనేక మంది క్యాబినెట్ సభ్యులు, మథుర పార్లమెంటు సభ్యురాలు, సోదరి హేమమాలిని గారు, మరియు నా ప్రియమైన బ్రజ్ నివాసితులు!ఉత్తరప్రదేశ్‌లోని మధురా నగరంలో సాధ్వి మీరాబాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
November 23rd, 06:27 pm
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఇవాళ సాధ్వి మీరాబాయి 525వ జయంతి వార్షికోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అలాగే ఆమె గౌరవార్థం స్మారక తపాలా బిళ్లతోపాటు నాణాన్ని ఆయన ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను, సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించారు. సాధ్వి మీరాబాయి స్మృత్యర్థం ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాలు ఈ కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి.మీరాబాయి మన దేశంలోని మహిళలకు స్ఫూర్తి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 29th, 11:00 am
నా ప్రియమైన కుటుంబసభ్యులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతం. దేశవ్యాప్తంగా పండుగల ఉత్సాహం నెలకొని ఉన్న తరుణంలో ఈ ఎపిసోడ్ జరుగుతోంది. రాబోయే అన్ని పండుగలకు మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు.మీరాబాయి జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
October 28th, 06:32 pm
యోగిని మీరాబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళి అర్పించడంతోపాటు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను శ్రీకృష్ణుని అసమాన భక్తురాలిగా అభివర్ణిస్తూ, ఆమె ఆలపించిన భక్తి గీతాలు నేటికీ ఇంటింటా ప్రతిధ్వనిస్తున్నాయని పేర్కొన్నారు. ఆమె జీవితం యావత్ సమాజానికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.