భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: ప్రధాని మోదీ

September 15th, 06:32 pm

ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్, శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సంయుక్తంగా సంసద్ టీవీని ప్రారంభించారు. భారత ప్రజాస్వామ్య కథలో సంసద్ టీవీ ప్రారంభించడం కొత్త అధ్యాయమని ప్రధాని పేర్కొన్నారు.

ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి లోక్‌స‌భ‌ స్పీకర్ చేతులమీదుగా ‘సంసద్ టీవీ’ ప్రారంభం

September 15th, 06:24 pm

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ఉప రాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌స‌భ‌ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా ‘‘సంసద్ టీవీ’’ని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- పార్లమెంటుతో ముడిపడిన టీవీ చానెల్ వేగంగా మారుతున్న కాలానికి... ముఖ్యంగా 21వ శతాబ్దంలో చర్చలు-సంభాషణల ద్వారా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు తగినట్లు రూపాంతరం చెందడాన్ని ప్రశంసించారు. ‘సంసద్ టీవీ’ ప్రారంభాన్ని భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయంగా ప్రధాని అభివర్ణించారు. సంసద్ టీవీ రూపంలో దేశవ్యాప్త చర్చలకు, సమాచార వ్యాప్తికి సంసద్ టీవీ ఒక మాధ్యమం కాగలదని, తద్వారా దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధులకు ఇది కొత్త గళంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘దూరదర్శన్’ 62 ఏళ్లు పూర్తిచేసుకోవడంపైనా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. మరోవైపు ఇవాళ ‘ఇంజనీర్ల దినోత్సవం’ కావడంతో దేశంలోని ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంసద్టివి ని సెప్టెంబర్ 15న కలసి ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్ లు

September 14th, 03:18 pm

సంసద్ టివి ని భారతదేశం ఉప రాష్ట్రపతి మరియు రాజ్య సభ చైర్ మన్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా లు 2021 సెప్టెంబర్ 15న సాయంత్రం 6 గంటల కు పార్లమెంట్ హౌస్ ఉప భవనం లోని ప్రధాన కమిటీ రూమ్ లో సంయుక్తం గా ప్రారంభించనున్నారు. అదే రోజు న ప్రజాస్వామ్యం అంతర్జాతీయ దినోత్సవం కూడా కావడం అనేది యాదృచ్చికం.