New Kashi has emerged as an inspiration for the new India: PM Modi

February 23rd, 11:00 am

PM Modi participated in the prize distribution ceremony of Sansad Sanskrit Pratiyogita at Swatantra Sabhagar, BHU, Varanasi. He lauded the efforts of the young generations who are strengthening the identity of the ancient city. He said that it is a matter of pride and contentment that the youth of India will take the country to new heights in the Amrit Kaal.

వారణాసి బి హెచ్ యు లోని స్వతంత్ర సభగర్ లో జరిగిన సంసద్ సంస్కృత ప్రతియోగిత బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రధాన మంత్రి

February 23rd, 10:20 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వారణాసిలోని బి హెచ్ యు లో స్వతంత్ర సభగర్ లో జరిగిన సంసద్ సంస్కృత ప్రతియోగిత బహుమతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాశీ సంసద్ ప్రతియోగిత బుక్ లెట్ ను, కాఫీ టేబుల్ బుక్ ను ఆయన ఆవిష్కరించారు. కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగిత, కాశీ సంసద్ ఫోటోగ్రఫీ ప్రతియోగిత, కాశీ సంసద్ సంస్కృత ప్రతియోగిత విజేతలకు, వారణాసిలోని సంస్కృత విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం సెట్లు, సంగీత వాయిద్యాలు, మెరిట్ స్కాలర్ షిప్ లను ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగిత గ్యాలరీని సందర్శించిన ఆయన 'సన్వర్తి కాశీ' థీమ్ పై ఫొటో ఎంట్రీలతో పాల్గొన్న వారితో ముచ్చటించారు.

Sports teach us that there is no limit to excellence, & we must strive with all our might: PM Modi

February 03rd, 12:00 pm

PM Modi addressed the Pali Sansad Khel Mahakumbh. Every sportspersons only win and learn they never lose, he said. The government has always supported sporting initiatives and has also enabled relevant infrastructure, he added. He said that sports enables the maintenance of physical and mental well-being.

పాలి లోక్‌స‌భ‌ క్రీడా మహోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 03rd, 11:20 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పాలి లోక్‌స‌భ‌ స్థానం పరిధిలో క్రీడా మహోత్సవం ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శించారంటూ క్రీడాకారులను ఆయన అభినందించారు. ‘‘ఆటల్లో పరాజయం అన్నదే ఉండదు.. మనం విజయం సాధిస్తాం.. లేదా అనుభవం సంపాదిస్తాం; కాబట్టే క్రీడాకారులతోపాటు వారి శిక్షకులు, కుటుంబ సభ్యులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. యువతరం ముందంజతోపాటు దేశాభివృద్ధిలో క్రీడల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ‘‘పార్లమెంటు స్థానం స్థాయి క్రీడా మహోత్సవంలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నేడు క్రీడాకారులకే కాకుండా, ప్రతి యువకుడికీ ఒక గుర్తింపుగా మారింది. క్రీడలపై ప్రభుత్వ స్ఫూర్తి మైదానంలో క్రీడాకారుల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఇటువంటి క్రీడా పోటీల నిర్వహణలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని జిల్లాలు, రాష్ట్రాలలోగల లక్షలాది ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈ క్రీడా మహోత్సవం ఒక వేదికగా నిలుస్తున్నదని తెలిపారు. అలాగే కొత్త, వర్ధమాన క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తూ సానపెట్టడంలోనూ ఇదొక మాధ్యమంగా మారిందన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా పోటీల నిర్వహణ గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.