మణిపూర్ సాంగై ఉత్సవంలో ప్రధానమంత్రి వీడియో సందేశం : తెలుగు అనువాదం

November 30th, 05:40 pm

కరోనా మహమ్మారి కారణంగా, రెండేళ్ల తర్వాత ఈ సాంగై పండుగను జరుపుకుంటున్నాం. ఇంతకు ముందు కంటే ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇది మణిపూర్ ప్రజల స్ఫూర్తిని, అభిరుచిని తెలియజేస్తుంది. ప్రత్యేకించి, మణిపూర్ ప్రభుత్వం ఇంత విశాల దృక్పథంతో దీన్ని నిర్వహించిన తీరు నిజంగా అభినందనీయం! ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ గారి తో పాటు, ఆయన మొత్తం ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను.

మణిపూర్‌ సంగై వేడుకల సందర్భంగావీడియో సందేశంద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

November 30th, 05:20 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ మణిపూర్ సంగై పండుగ సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటున్న రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. రాష్ట్రంలో గొప్ప పండుగగా పేరుపొందిన ఈ వేడుకలు మణిపూర్‌ను ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడంలో తోడ్పడతాయని ఆయన అన్నారు. మణిపూర్‌కు ప్రత్యేకమైన రాష్ట్ర జంతువు ‘సంగై’ (నుదురు-కొమ్ముల దుప్పి) పేరిట ఈ పండుగకు ఆ పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్స‌వాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించుకోవడంపై మణిపూర్ ప్ర‌జ‌ల‌ను ప్రధాని అభినందించారు. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ల విరామం తర్వాత ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నందున భారీ ఏర్పాట్లు చేయడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. “మణిపూర్ సంగై వేడుకలు రాష్ట్ర ప్రజల స్ఫూర్తిని, అభిరుచిని ప్రతిబింబిస్తాయి” అన్నారు. ఈ పండుగ నిర్వహణ కోసం మణిపూర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ చేసిన కృషితోపాటు ఆయన సమగ్ర దృక్పథాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.