నవంబర్ 26 నరాజ్యాంగ దినం ఉత్సవాల లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి

November 24th, 05:14 pm

రాజ్యాంగ పరిషత్తు 1949వ సంవత్సరం లో భారతదేశ రాజ్యాంగాని కి అంగీకారం తెలిపిన సంఘటన ను స్మరించుకోవడం కోసం నవంబరు 26 న దేశ ప్రజలు రాజ్యాంగ దినాన్ని వేడుక గా జరుపుకోనున్నారు. రాజ్యాంగ దినాన్ని పాటించడం అనేది 2015వ సంవత్సరం లో మొదలైంది. ఈ చరిత్రాత్మకమైన రోజు కు గల ప్రాముఖ్యాన్ని తగిన రీతి న గుర్తించడం కోసం ప్రధాన మంత్రి కనబరచిన దృష్టి కోణం ఆధారం గా ఈ దినాన్ని ఆచరించడం జరుగుతోంది. శ్రీ నరేంద్ర మోదీ తాను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలం లో 2010వ సంవత్సరం లో నిర్వహించినటువంటి ‘‘సంవిధాన్ గౌరవ్ యాత్ర’’ నాడే ఈ దృష్టి కోణం తాలూకు బీజం అంకురించింది అని కూడా చెప్పవచ్చును.