ఎస్ సిఒ సమిట్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్యాఖ్యలు

September 16th, 01:30 pm

ప్రస్తుతం, యావత్తు ప్రపంచం మహమ్మారి అనంతరం ఆర్థికం గా పుంజుకోవడం లో సవాళ్ల ను ఎదుర్కొంటున్నప్పుడు, ఎస్ సిఒ యొక్క భూమిక చాలా ముఖ్యమైంది గా మారిపోతుంది. ఎస్ సిఒ సభ్యత్వ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి లో సుమారు 30 శాతాన్ని తామే అందిస్తున్నాయి. మరి ప్రపంచ జనాభా ల 40 శాతం జనాభా నివసిస్తున్నది కూడా ఎస్ సిఒ దేశాల లోనే. ఎస్ సిఒ సభ్యత్వ దేశాల మధ్య మరింత సహకారాన్ని మరియు పరస్పర విశ్వాసాన్ని భారతదేశం సమర్ధిస్తుంది. మహమ్మారి మరియు యూక్రేన్ లో సంకటం ప్రపంచ సరఫరా వ్యవస్థల లో అనేక అడ్డంకుల ను ఏర్పరచాయి. ఈ కారణంగా, యావత్తు ప్రపంచం ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయి లో శక్తి సంబంధి మరియు ఆహారం సంబంధి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మన ప్రాంతం లో ఆధారపడదగ్గ, ఆటుపోటులకు తట్టుకొని నిలబడగలిగిన మరియు వివిధత్వంతో కూడిన సరఫరా వ్యవస్థల ను తప్పక అభివృద్ధి పరచాలి. దీనికి గాను మెరుగైనటువంటి సంధానం అవసరపడుతుంది; అలాగే మనం అందరం ఒక దేశానికి మరొక దేశం గుండా ప్రయాణించడానికి పూర్తి హక్కు ను ఇవ్వడం కూడా ప్రధానం.

ఎస్ సిఒ సమిట్ కుహాజరవడం కోసం సమర్ కంద్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి

September 15th, 10:01 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్ బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ శావ్ కత్ మిర్జియోయెవ్ ఆహ్వానించిన మీదట శంఘాయి సహకార సంస్థ (ఎస్ సిఒ) యొక్క దేశాధినేతల మండలి తాలూకు 22వ సమావేశాని కి హాజరవడం కోసం ఈ రోజు న సాయంత్రం పూట ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ కు చేరుకొన్నారు.

PM Modi to visit Samarkand, Uzbekistan

September 15th, 02:15 pm

I will be visiting Samarkand at the invitation of President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev to attend the Meeting of the Council of Heads of State of the Shanghai Cooperation Organization (SCO).