తొలి బోడోలాండ్ మహోత్సవ్ ను ఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

November 14th, 04:10 pm

ప్రప్రథమ ‘బోడోలాండ్ మహోత్సవ్‌’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజున అంటే ఈ నెల 15న, సాయంత్రం దాదాపు 6:30 గంటలకు న్యూ ఢిల్లీలోని ఎస్ఏఐ ఇందిరా గాంధీ క్రీడా భవన సముదాయంలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.