Swarved Mahamandir is a modern symbol of India’s social and spiritual strength: PM Modi

December 18th, 12:00 pm

PM Modi inaugurated Swarved Mandir in Umaraha, Varanasi, UP. He highlighted the contributions of Maharshi Sadafal Dev Ji towards knowledge and Yog in the previous century and said that its pine light has transformed the lives of millions of people around the world. He expressed confidence that every offering to the Mahayajna will strengthen the resolve of Viksit Bharat.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

December 18th, 11:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వారణాసిలోని ఉమరహాలో స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించారు. మహర్షి సదాఫల్ దేవ్ జీ మహారాజ్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాన మంత్రి, ఆలయ సముదాయాన్ని సందర్శించారు. స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, తాను కాశీ సంద‌ర్శ‌కు ఈరోజు రెండో రోజు అని, కాశీలో గ‌డుపుతున్న ప్ర‌తి క్షణమూ అపూర్వ‌మైన అనుభూతుల‌తో నిండిపోతుంద‌ని వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం అఖిల భారతీయ విహంగం యోగ్ సంస్థాన్ వార్షిక ఉత్సవాలను గుర్తుచేసుకున్న ప్రధాన మంత్రి, ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాల్లో భాగమయ్యే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ విహంగం యోగ సాధన వంద సంవత్సరాల మరపురాని ప్రయాణాన్ని సాధించిందని అన్నారు. మునుపటి శతాబ్దంలో జ్ఞానం, యోగా పట్ల మహర్షి సదాఫల్ దేవ్ జీ చేసిన సేవలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దాని దివ్య కాంతి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చిందని అన్నారు. ఈ శుభ సందర్బంగా, 25,000 కుండియా స్వర్వేద్ జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తుతించారు. మహాయజ్ఞానికి ఇచ్చే ప్రతి సమర్పణ వికసిత్ భారత్ సంకల్పాన్ని బలపరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అతను మహర్షి సదాఫల్ దేవ్ జీ కి నివాళులు అర్పిస్తూ, దర్శనాన్ని అందించిన సాధువులందరికీ కూడా తన నివాళులర్పించాడు.

Banaras is giving a new direction to the country: PM Modi

December 14th, 03:19 pm

Prime Minister Shri Narendra Modi attended a public function for the 98th anniversary celebrations of Sadguru Sadafaldeo Vihangam Yog Sansthan at Swarved Mahamandir Dham in Umraha Gram, Uttar Pradesh.

ఉత్తరప్రదేశ్‌లోని ఉమ్రాహా గ్రామ్‌లోని స్వరవేద మహామందిర్ ధామ్‌లో సద్గురు సదాఫల్దియో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవాలకు హాజరైన ప్రధానమంత్రి

December 14th, 03:17 pm

ఉత్తరప్రదేశ్‌లోని ఉమ్రాహా గ్రామ్‌లోగల స్వరవేద మహామందిర్ ధామ్‌లో నిర్వహించిన సద్గురు సదాఫల్దియో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవాలకు ప్రధానమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ- కాశీ నగరంలో అద్భుతమైన ‘విశ్వనాథ్‌ ధామ్‌’ను నిన్న మహాదేవుని పాదాలకు అంకితం చేయడాన్ని గుర్తుచేసుకున్నారు. “కాశీనగర శక్తి నిరంతరం ప్రవేహించేది మాత్రమేగాక కొత్త కోణాలకు ప్రసరించడం కొనసాగిస్తుంది” అని ఆయన చెప్పారు. అలాగే పవిత్ర గీతాజయంతి నేపథ్యంలో కృష్ణ భగవానుని పాదాలకు ఆయన ప్రణామం చేశారు. “కురుక్షేత్ర సమరాంగణంలో సైనిక బలగాలు ముఖాముఖి తలపడిన ఇదే రోజున మానవాళికి ఆధ్యాత్మిక పరమార్థంతోపాటు జ్ఞానయోగ లబ్ధి కలిగింది. ఇటువంటి గీతా జయంతి పర్వదినం సందర్భంగా కృష్ణ భగవానుని పాదాలకు ప్రణమిల్లుతూ మీతోపాటు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.