Strategy of creating alternative income streams for farmers is bearing fruit: PM
July 28th, 05:26 pm
PM Modi inaugurated and laid the foundation stone of multiple projects at Sabar Dairy in Gujarat. These projects will empower local farmers and milk producers and increase their income. This will also give a boost to the rural economy in the region.వేయి కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల కు సాబర్ కాంఠాలోని సాబర్ డెయరి లో ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం/శంకుస్థాపన జరిపారు
July 28th, 12:04 pm
వేయి కోట్ల రూపాయల పై చిలుకు విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల కు గుజరాత్ లోని సాబర్ కాంఠా లో గల గఢోడా చౌకీ లో నెలకొన్న సాబర్ డెయరి లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభోత్సవం/శంకుస్థాపన లు జరిపారు. ఈ ప్రాజెక్టు లు స్థానిక రైతుల కు మరియు పాల ఉత్పత్తిదారుల కు సాధికారిత ను కల్పించడం తో పాటు వారి ఆదాయం వృద్ధి చెందడం లో దోహదం చేయనున్నాయి. అంతేకాక ఇది ఆ ప్రాంతం లోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఒక ఊతాన్ని కూడా అందించనుంది. ప్రధాన మంత్రి ఈ సందర్భం లో సుకన్య సమృద్ధి పథకం లబ్ధిదారుల ను మరియు పాల ఉత్పత్తి లో అగ్రగాములు గా నిలచిన మహిళల ను సత్కరించారు. ఈ కార్యక్రమాని కి హాజరైన వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయీ పటేల్ కూడా ఉన్నారు.జులై 28వ, 29వ తేదీల లో గుజరాత్ ను మరియు తమిళ నాడు నుసందర్శించనున్న ప్రధాన మంత్రి
July 26th, 12:52 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జులై 28వ, 29వ తేదీల లో గుజరాత్ ను మరియు తమిళ నాడు ను సందర్శించనున్నారు. జులై 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వేళ లో సాబర్ కాంఠా లోని గఢోడా చౌకీ ప్రాంతం లో సాబర్ డెయరి కి చెందిన అనేక ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించడమే కాకుండా మరికొన్ని పథకాల కు శంకుస్థాపన ను కూడా చేయనున్నారు. అటు తరువాత ప్రధాన మంత్రి చెన్నై కు పోయి సాయంత్రం సుమారు 6 గంటల వేళ కు చెన్నై లోని జెఎల్ఎన్ ఇండోర్ స్టేడియమ్ లో 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభం అయినట్లు గా ప్రకటిస్తారు.