ఉత్తరప్రదేశ్ వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 04:54 pm
వేదికపైన ఆశీనులైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ గారూ, రాష్ట ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గారూ, సాంకేతికత మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన ఇతర రాష్ట్రాల గవర్నర్లూ, ముఖ్యమంత్రులూ, కేంద్ర మంత్రిమండలి సభ్యులూ, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ నాయుడు గారూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ గార్లూ, రాష్ర్ట మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ, శాసన సభ్యులూ, ఇంకా బెనారస్ వాసులైన నా ప్రియ సోదరీ సోదరులారా...ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి
October 20th, 04:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. రూ.6,100 కోట్లకు పైగా విలువైన పలు విమానాశ్రయాల ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.వారాణసీ ని సెప్టెంబర్ 23 వ తేదీ న సందర్శించనున్న ప్రధాన మంత్రి
September 21st, 10:16 am
వారాణసీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 23 వ తేదీ నాడు సందర్శించనున్నారు. వారాణసీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియమ్ కు ప్రధాన మంత్రి మధ్యాహ్నం పూట సుమారు ఒంటిగంటన్నర వేళ కు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం దాదాపు గా 3 గంటల 15 నిమిషాల కు, ప్రధాన మంత్రి రుద్రాక్ష్ ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్ వెన్శన్ సెంటరు కు చేరుకొని కాశీ సంసద్ సాంస్కృతిక్ మహోత్సవ్ 2023 యొక్క ముగింపు కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. ఇదే కార్యక్రమం లో, ఆయన ఉత్తర్ ప్రదేశ్ లో లో నిర్మాణం పూర్తయిన 16 అటల్ ఆవాసీయ విద్యాలయాల ను కూడా ప్రారంభించనున్నారు.