రోటరీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి - ప్రసంగం

June 05th, 09:46 pm

రోటరీ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ స్థాయిలో జరుగుతున్న ప్రతి రోటరీ సమావేశం ఒక చిన్న- ప్రపంచ కూటమి లాంటిది. ఇందులో వైవిధ్యం ఉంది. చైతన్యం ఉంది. మీ రొటేరియన్ లు అందరూ మీ మీ స్వంత రంగాల్లో విజయం సాధించినప్పటికీ, మీ వ్యాపకానికి మాత్రమే మీరు పరిమితం కాలేదు. మన ప్రపంచం అంతా బాగుండాలనే మీ కోరిక మిమ్మల్ని ఈ వేదికపైకి తీసుకొచ్చింది. ఇది విజయం మరియు సేవ యొక్క నిజమైన మిశ్రమంగా నేను భావిస్తున్నాను.

రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ అంత‌ర్జాతీయ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 05th, 09:45 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌ల్డ్ క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. రోటేరియ‌న్లు విజ‌య్ం, సేవ ల నిజ‌మైన క‌ల‌యిక‌కు ప్ర‌తిబింబం అన్నారు.ఈ స్థాయిలో ప్ర‌తి రోట‌రీ స‌మావేశం ఒక మినీ గ్లోబ‌ల్ అసెంబ్లీ వంటిద‌ని అన్నారు. ఇందులో వైవిధ్య‌త‌, చైత‌న్యం రెండూ ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.