భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ, స్వీడిష్ సిఈఓలతో ప్రధాని మోదీ చర్చ
April 17th, 05:52 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు స్వీడిష్ సిఈఓలతో చర్చించారు. ఆయన ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరియు వ్యాపార సంబంధాలను చర్చించారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు స్వీడన్ విలువైన భాగస్వామని, భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను ప్రధాని మోదీ వివరించారు.స్వీడన్ లో పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఏప్రిల్ 17, 2018)
April 17th, 04:50 pm
ఇది స్వీడన్ లో నా ఒకటో పర్యటన. దాదాపు మూడు దశాబ్దాల విరామం అనంతరం భారతదేశ ప్రధాన మంత్రి స్వీడన్ లో పర్యటిస్తున్నారు. మా గౌరవార్థం స్వీడన్ లో సాదర స్వాగతాన్ని అందించినందుకు స్వీడిష్ ప్రభుత్వానికి మరియు ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ కు నేను నా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకొంటున్నాను. ఈ పర్యటన కాలంలో ఇతర నార్డిక్ దేశాలతో భారతదేశం యొక్క శిఖర సమ్మేళనాన్ని కూడా ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ ఏర్పాటు చేశారు. అందుకు కూడా నేను నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.