వందేమాతరం 150 సంవత్సరాల ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధానమంత్రి ప్రసంగం
December 08th, 12:30 pm
ఈ ప్రత్యేక సందర్భంలో సామూహికంగా చర్చించేందుకు ముందుకు వచ్చినందుకు మీకు, ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని శక్తి, త్యాగస్పూర్తి, నిరాడంబరతను నింపిన ఆ మంత్రాన్ని, ఆ స్పష్టమైన పిలుపును గౌరవంగా గుర్తుచేసుకుంటూ.. ఈ సభలో వందేమాతరాన్ని స్మరించుకోవడం మనందరికీ గొప్ప గౌరవం. వందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలబడటం చాలా గర్వకారణం. ఈ కాలం చరిత్ర విస్తృతి నుంచి లెక్కలేనన్ని సంఘటనలను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ చర్చ ఖచ్చితంగా సభ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కానీ మనం ఈ క్షణాన్ని సమష్టిగా ఉపయోగించుకుంటే రాబోయే తరాలకు, ప్రతి తరానికి కూడా నేర్చుకునే మూలంగా ఉపయోగపడుతుంది.జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్ సభ ప్రత్యేక చర్చలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 08th, 12:00 pm
జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు లోకసభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ విశేష సందర్భంలో సమష్టి చర్చకు అంగీకరించిన గౌరవ సభ్యులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజాన్నీ, ప్రేరణనూ అందించి.. త్యాగనిరతి - దృఢసంకల్పంతో కూడిన మార్గాన్ని నిర్దేశించిన ‘వందేమాతరం’ మంత్రాన్ని స్మరించుకుంటున్నామని, సభలో ఉన్న వారందరికీ ఇదో గొప్ప గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన ఈ చరిత్రాత్మక సందర్భం దేశానికి గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. ఈ వేళ అనేక చారిత్రక సంఘటనలు మన కళ్లెదుట కదలాడేలా నిలుపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చ సభ అంకితభావాన్ని చాటడమే కాకుండా, భావి తరాలు అవగాహన పెంచుకునే జ్ఞానసంపదగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సభ్యులంతా ఈ చర్చను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సత్కార కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 01st, 11:15 am
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సభలోని గౌరవనీయ సభ్యులందరికీ ఇది గర్వకారణమైన రోజు. ఈ సందర్భంగా మీకు మా సాదర స్వాగతం... మీ మార్గదర్శకత్వాన ఈ సభలో కీలకాంశాల చర్చకు, తద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విధంగా మీ అమూల్య మార్గదర్శనం లభించడం మాకందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ మేరకు సభ తరపున, నా తరపున మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గౌరవనీయ సభ్యులందరూ ఈ ఎగువ (రాజ్య)సభ మర్యాదను సదా పరిరక్షిస్తారని, చైర్మన్‌గా మీ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుతారని వాగ్దానం చేస్తున్నాను.. ఇది మీకు నేనిస్తున్న హామీ.రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ సన్మాన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
December 01st, 11:00 am
రాజ్యసభకు తొలిసారి అధ్యక్షత వహించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు. గౌరవ రాజ్యసభ సభ్యులందరికీ ఈ రోజు గర్వకారణమని ప్రధానమంత్రి అభివర్ణించారు. చైర్మన్‌కు సాదర స్వాగతం పలుకుతూ.. “సభ తరఫున, నా తరఫున మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా అభినందనలు, శుభకామనలు. అత్యున్నతమైన ఈ సభా మర్యాదను గౌరవ సభ్యులందరూ ఎప్పటి మాదిరే కాపాడతారని, మీతో వారంతా విజ్ఞతతో వ్యవహరిస్తారని అనుకుంటున్నాను. ఇందుకు నాదీ హామీ” అని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు.అధికారిక కార్యక్రమాల్లో పొందిన బహుమతుల ఆన్ లైన్ వేలంలో పాల్గొనాలని దేశ ప్రజలకు ప్రధాని ఆహ్వానం
September 24th, 01:09 pm
తన అధికారిక కార్యాక్రమాలు, సమావేశాల సందర్భంగా స్వీకరించిన బహుమతుల వేలం ప్రారంభమయ్యిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ వేలంలో పౌరులు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు. గంగా నది సంరక్షణ, పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకం- నమామి గంగే.Bharat Ratna for Bhupen Da reflects our government's commitment to the North East: PM Modi in Guwahati, Assam
September 13th, 08:57 pm
PM Modi addressed the 100th birth anniversary of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam, calling it a remarkable day and a great privilege to be part of the celebrations. The PM shared, Bhupen Da, lovingly known as “Shudha Kantho,” gave voice to India’s unity, dreams and compassion of Mother India. “Bhupen Da’s entire life was dedicated to the nation’s goals,” PM Modi remarked, affirming the centenary year as a true tribute to his legacy.PM Modi addresses the 100th birth anniversary celebrations of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam
September 13th, 05:15 pm
PM Modi addressed the 100th birth anniversary of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam, calling it a remarkable day and a great privilege to be part of the celebrations. The PM shared, Bhupen Da, lovingly known as “Shudha Kantho,” gave voice to India’s unity, dreams and compassion of Mother India. “Bhupen Da’s entire life was dedicated to the nation’s goals,” PM Modi remarked, affirming the centenary year as a true tribute to his legacy.Mauritius is an important pillar of India’s ‘Neighbourhood First’ policy and Vision ‘Mahasagar’: PM Modi
September 11th, 12:30 pm
In his remarks at the joint press meet in Varanasi, PM Modi said that just like the uninterrupted flow of the Ganga in Kashi, the continuous stream of Indian culture has enriched Mauritius. He congratulated PM Ramgoolam and the people of Mauritius on the successful conclusion of the Chagos Agreement. The PM also announced a Special Economic Package for Mauritius to strengthen infrastructure, create jobs, and improve healthcare.బీహార్ రాష్ట్ర జీవనోపాధి నిధి సహకార రుణ పరపతి సమాఖ్య లిమిటెడ్ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
September 02nd, 01:00 pm
బీహార్ ప్రజలకు అభిమానపాత్రులైన ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ సామ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ కుమార్ సిన్హా, ఇతర ప్రముఖులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది సోదరీమణులారా... మీకందరికీ హృదయపూర్వక వందనం!బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకార సంఘాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 02nd, 12:40 pm
బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకార సంఘం లిమిటెడ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఈ మంగళప్రదమైన మంగళవారం రోజు, చాలా ఆశాజనక కార్యక్రమానికి నాందీప్రస్తావన చేసుకుంటున్నామన్నారు. జీవికా నిధి రుణ సహకార సంఘ రూపంలో బీహార్‌లోని తల్లులకు, ఆడపడుచులకు ఒక కొత్త సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం గ్రామాల్లో జీవికతో అనుబంధం కలిగి ఉన్న మహిళలకు మరింత సులభంగా ఆర్థిక సహాయ సహకారాన్ని అందుబాటులోకి తీసుకు వస్తుందని, వారు పనిలోను, వ్యాపారాల్లోను ముందడుగు వేయడానికి ఇది సాయపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. జీవికా నిధి వ్యవస్థ పూర్తి డిజిటల్ మాధ్యమంలో పనిచేస్తుందని, పనిగట్టుకొని కాళ్లరిగేలా తిరిగే అవసరం ఇక ఉండదని, ప్రతి పనినీ ఇప్పుడు చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే చక్కబెట్టవచ్చని చెబుతూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జీవికా నిధి రుణ సహకార సంఘం ప్రారంభం అయినందుకు బీహార్‌లోని తల్లులకు, ఆడపడుచులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ అసాధారణ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకు వచ్చినందుకు శ్రీ నీతీశ్ కుమార్‌ను, బీహార్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు.ఆగస్టు 22న బిహార్, పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్న ప్రధాని
August 20th, 03:02 pm
ఆగస్టు 22న బీహార్, పశ్చిమ బెంగాల్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. బిహార్ లోని గయలో ఉదయం 11 గంటలకు రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. అక్కడే రెండు రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత గంగా నదిపై నిర్మించిన ఆంటా- సిమారియా వంతెనను సందర్శించి ప్రారంభిస్తారు.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
August 02nd, 11:30 am
నమఃపార్వతీ పతయే.. హర హర మహాదేవ.. పవిత్ర శ్రావణ మాసంలో కాశీలోని నా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఈ రోజు నాకు లభించింది. ఈ సందర్భంగా మీకందరికీ ఇదే నా ప్రణామం.వారణాసిలో దాదాపు రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 02nd, 11:00 am
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ.2,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వారణాసిని సందర్శించడం, ఇక్కడి ప్రజలను కలవడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వారణాసి ప్రజలతో తనకు భావోద్వేగ అనబంధముందన్న శ్రీ మోదీ.. ఆదరాభిమానాలను కనబరిచిన నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులతో సంభాషించడంపై శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆది తిరువత్తిరై ఉత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
July 27th, 12:30 pm
పూజనీయ ఆధీనం మఠాధిపతి గారు, చిన్మయ మిషన్ స్వామీజీలు, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, మంత్రివర్గ సహచరుడు డాక్టర్ ఎల్. మురుగన్ గారు, స్థానిక ఎంపీ తిరుమా వలవన్ గారు, వేదికపై ఉన్న తమిళనాడు మంత్రులూ, పార్లమెంటు సహచరుడు ఇళయరాజా గారు, ఒడువర్లు, భక్తులు, విద్యార్థులు, సాంస్కృతిక చరిత్రకారులు, ప్రియమైన సోదరీ సోదరులా! నమఃశివాయ.తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 27th, 12:25 pm
తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఈ రోజు ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మున్ముందుగా ఆదిదేవుడైన మహాశివునికి నీరాజనం అర్పిస్తూ- రాజరాజ చోళుడు రాజ్యమేలిన పవిత్ర భూమిలో పరమేశుని దివ్య దర్శనంతో తనలో ఆధ్యాత్మిక శక్తి పెల్లుబికిందని పేర్కొన్నారు. శ్రీ ఇళయరాజా స్వరాలు సమకూర్చిన భక్తి గీతాలాపనను అమితంగా ఆస్వాదించానని చెప్పారు. శైవారాధకులైన ‘ఓతువర్ల’ పవిత్ర మంత్రోచ్చారణ నడుమ సర్వశక్తిమంతుడైన శివుడికి నమస్కరిస్తూ- ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణంతో తాదాత్మ్యం చెందానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.మహా కుంభమేళాపై లోక్ సభలో ప్రధాని ప్రసంగం
March 18th, 01:05 pm
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాపై నేనిప్పుడు మాట్లాడబోతున్నాను. ఈ గౌరవ సభ ద్వారా లక్షలాది మంది దేశ ప్రజలకు నమస్కరిస్తున్నాను. వారి సహకారంతోనే మహా కుంభమేళా విజయవంతమైంది. ఈ బృహత్ కార్యక్రమం విజయవంతం కావడంలో అనేక మంది వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం, సమాజం, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికే అంకితమై సేవలందించిన కార్మికులందరికీ నా అభినందనలు. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు, ప్రత్యేకించి ప్రయాగరాజ్ వాసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.PM Modi addresses Lok Sabha on successful conclusion of Maha Kumbh
March 18th, 12:10 pm
PM Modi while addressing the Lok Sabha on Mahakumbh, highlighted its spiritual and cultural significance, likening its success to Bhagirath’s efforts. He emphasized unity, youth reconnecting with traditions, and India's ability to host grand events. Stressing water conservation, he urged expanding river festivals. Calling it a symbol of ‘Ek Bharat, Shreshtha Bharat,’ he hailed Mahakumbh’s legacy.మారిషస్‌లోని భారతీయులతో సమావేశంలోప్రధానమంత్రి ప్రసంగం
March 12th, 06:07 am
పదేళ్ల కిందట ఇదే తేదీన నేను మారిషస్ పర్యటనకు వచ్చేనాటికి ఓ వారం ముందే మేం హోలీ పండుగ చేసుకున్నాం. అప్పుడు భారత్ నుంచి హోలీ వేడుకల సంరంభాన్ని నాతో మోసుకొచ్చాను. అయితే, ఈసారి వర్ణరంజిత హోలీ సంరంభాన్ని మారిషస్ నుంచి మన దేశానికి తీసుకెళ్తాను. ఈ నెల 14వ తేదీన హోలీ కాబట్టి.. వేడుకలకు మరొక రోజు మాత్రమే ఉంది.మారిషస్‌లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 11th, 07:30 pm
మారిషస్ ప్రధాని శ్రీ నవీన్ చంద్ర రాంగులాంతో పాటు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్‌లోని ట్రాయోన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని, ఇండియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తినిపుణులు, సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు సహా భారతీయ ప్రవాసులు చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మారిషస్ మంత్రులు అనేక మందితోపాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఉత్తరాఖండ్‌లోని హర్శిల్‌లో శీతాకాల పర్యాటక కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 06th, 02:07 pm
ఈ వేదికపై ఆసీనులైన నా సోదరుడు, చురుకైన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామ్ గారు, కేంద్ర మంత్రి శ్రీ అజయ్ టమ్టాగారు, రాష్ట్ర మంత్రి సత్పాల్ మహరాజ్ గారు, పార్లమెంటులో నా సహ సభ్యులైన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులు మహేంద్ర భట్ గారు, మాలా రాజ్యలక్ష్మిగారు, ఎమ్మెల్యే సురేష్ గారు, ఇతర ప్రముఖులు, సభకు హాజరైన సోదరీసోదరులారా!