మన నాగరికత, సంస్కృతి మరియు భాషలు వైవిధ్యంలో ఐక్యత సందేశాన్ని మొత్తం ప్రపంచానికి తెలియజేస్తాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

November 24th, 11:30 am

తద్వారా నాకు కూడా కొన్ని గతరోజుల జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకునే అవకాశం లభిస్తుంది. ముందుగా NCC లోని ప్రస్తుత, పూర్వ కేడేట్లకి నా అనేకానేక శుభాకాంక్షలు. ఎందుకంటే నేను కూడా మీలాగనే ఒకప్పుడు NCC కేడెట్ నే. ఇవాళ్టికీ మనసులో నన్ను నేను ఒక కేడెట్ లాగే భావించుకుంటాను. NCC అంటే National Cadet Corps అని అందరికీ తెలుసిన విషయమే. ప్రపంచంలో అతిపెద్ద uniformed youth organizations అన్నింటిలోనూ, మన భారతదేశం లోని NCC ఒకటి. ఇది ఒక Tri-service Organization. ఇందులో మన సాయుధదళాలు, జల, వాయు సేనలు మూడూ కలిసి ఉంటాయి. నాయకత్వం, దేశభక్తి, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, మొదలైన సద్గుణాలను తమ స్వభావంలో భాగంగా మార్చుకుని, వీటిని తమ అలవాట్లుగా మార్చుకునే అద్భుత ప్రయాణం పేరే NCC ! ఈ యాత్రను గురించి మరిన్ని కబుర్లు ఇవాళ మనతో ఫోన్లో చెప్పుకుందుకు, NCC లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్న కొందరు యువత తయారుగా ఉన్నారు. రండి వారితో మాట్లాడదాం.

అభివృద్ధి చెందిన నవభారతదేశం నిర్మాణం కోసం ఈశాన్యప్రాతాల అభివృద్ధి

June 12th, 02:49 pm

భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలు 'అష్ట లక్ష్ములు' గా ఉంటే. రైల్వేలు, రహదారులు, వాయుమార్గాలు, జలమార్గాలు మరియు ఐ-మార్గాలు కనెక్టివిటీని పెంచుకోవడానికి 'పంచ తత్వాలు' గా వున్నాయి ఈ ఐదు అంశాలు ద్వారా ఈశాన్య ప్రజల సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది..

Infrastructure is extremely important for development: PM Modi

May 26th, 12:26 pm

PM Narendra Modi inaugurated India’s longest bridge – the 9.15 km long Dhola-Sadiya Bridge built over River Brahmaputra in Assam. The Prime Minister said that infrastructure was extremely important for development. He added that the bridge would enhance connectivity between Assam and Arunachal Pradesh, and open the door for economic development on a big scale.

భారతదేశంలోనే అత్యంత పొడవాటి వంతెనను అస్సామ్ లో ప్రారంభించి, ఢోలా లో బహిరంగ సభలో ప్రసంగించిన శ్రీ మోదీ

May 26th, 12:25 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశంలోనే అత్యంత పొడవాటి వంతెన అయిన ఢోలా- సాదియా నదీ వంతెనను ఈ రోజు ప్రారంభించారు. ఈ వంతెన అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పైన నిర్మితమైంది. దీని పొడవు 9.15 కిలోమీటర్లు. శ్రీ మోదీ ప్రధాన మంత్రిగా పదవీబాధ్యతలను స్వీకరించి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఇదే ఆయన పాల్గొన్న తొలి కార్యక్రమం.