భారత్ – ఆస్ట్రేలియా రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సు
November 20th, 08:38 pm
రియో డి జనీరో జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ, నవంబర్ 19న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీజ్ తో కలిసి భారత్-ఆస్ట్రేలియా రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. శ్రీ ఆల్బనీజ్ 2023 భారత అధికారిక పర్యటన సందర్భంగా ఈ సదస్సు తొలి విడత సమావేశాలు మార్చి 10వ తేదీన న్యూఢిల్లీలో జరిగాయి.చిలీ దేశాధ్యక్షుడితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ
November 20th, 08:36 pm
బ్రెజిల్ దేశ రాజధాని రియో డి జనీరోలో ఏర్పాటైన జి-20 సమావేశాల నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న చిలీ దేశపు అధ్యక్షుడు శ్రీ గాబ్రియల్ బోరిక్ ఫాంట్ తో తొలిసారి భేటీ అయ్యారు.అర్జెంటీనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ మోదీ
November 20th, 08:09 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న అర్జెంటీనా (ఆర్జెంటీన్ రిపబ్లిక్) అధ్యక్షుడు శ్రీ జేవియర్ మిలే తో సమావేశమయ్యారు.బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
November 20th, 08:05 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాకియో లూలా ద సిల్వా తో సమావేశమయ్యారు. శ్రీ లూలా ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, జి-20, ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. పేదరికం, క్షుద్బాధల నిర్మూలన కోసం ప్రపంచ స్థాయి సహకార సమితిని ప్రారంభించాలన్న శ్రీ లూలా యోచన పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మోదీ, సంస్థకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని వెల్లడించారు. మూడు దేశాల జి-20 ప్రత్యేక బృందం (ట్రోయికా) సభ్య దేశంగా బ్రెజిల్ జి-20 ఎజెండాకు శ్రీ మోదీ సంపూర్ణ మద్దతును తెలిపారు. జి-20 కార్యాచరణ పత్రంలో సుస్థిరాభివృద్ధి, ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి లక్ష్యాలను పేర్కొనడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు ప్రాముఖ్యాన్నివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే యేడాది బ్రెజిల్ చేపట్టనున్న ‘బ్రిక్స్’ సదస్సు, ‘కాప్-30’ అధ్యక్ష బాధ్యతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ, బ్రెజిల్ కు భారత్ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.టెక్నాలజీ పరంగా ఆరోగ్య రంగంలో భారతదేశం చురుగ్గా పని చేస్తోంది: ప్రధానమంత్రి
November 20th, 05:02 am
ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యాన్ని ఇచ్చినప్పుడే భూమి మేలైన ఆవాసంగా మారుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీని సమన్వయ పరచడానికి ప్రథమ ప్రాధాన్యాన్ని ఇస్తూ, ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశం క్రియాశీలంగా ముందుకు సాగిపోతోందని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రపంచమంతటా జరుగుతున్న కృషిని భారత్ బలపరుస్తుందని ఆయన ప్రధానంగా చెప్పారు.స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై జి20 కార్యక్రమం; ప్రధానమంత్రి ప్రసంగానికి అనువాదం
November 20th, 01:40 am
ఈ రోజు కార్యక్రమానికి ఎంపిక చేసుకొన్న ఇతివృత్తం చాలా సందర్భ శుద్ధిగలదీ, తరువాతి తరం భవిష్యత్తుతో ముడిపడిందీనూ. న్యూ ఢిల్లీలో ఇదివరకు జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించినప్పుడు, స్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్) ను త్వరితగతిన సాధించడానికి ‘వారణాసి కార్యచరణ ప్రణాళిక’ను మనం ఆమోదించాం.స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 20th, 01:34 am
స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. జి20 శిఖరాగ్ర సమావేశాన్ని ఇది వరకు న్యూఢిల్లీలో నిర్వహించినప్పుడు 2030కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు, ఇంధన సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని జి20 తీర్మానించిందని ఆయన గుర్తు చేశారు. స్థిరాభివృద్ధి సాధనకు సంబంధించిన ఈ ప్రాథమ్యాలను ముందుకు తీసుకు పోవాలని బ్రెజిల్ నిర్ణయించడాన్ని ఆయన స్వాగతించారు.ఇటలీ-ఇండియా ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029
November 19th, 09:25 am
శక్తిమంతమైన ఇండియా-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉమ్మడి కార్యాచరణ ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ నిర్ణయించారు. నవంబరు 18న బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జరిగిన జీ-20 సమావేశానికి హాజరైన సందర్భంగా వారిరువురూ భేటీ అయ్యారు. మరింత స్పష్టతతో, నిర్ణీత సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావించారు. ఇందుకోసం వారు వ్యూహాత్మక కార్యాచరణకు రూపకల్పన చేశారు.ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ
November 19th, 08:34 am
రియో డి జెనీరో లో జరుగుతున్న జి-20 సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలు జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. 2024 జూన్, ఇటలీలోని ‘పూలీయా’ లో జార్జియా మెలోనీ అధ్యక్షతన ఏర్పాటైన జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన నేటి సమావేశం గత రెండేళ్ళలో అయిదోది. ఎన్నో సమస్యల మధ్య చేపట్టిన జి-7 అధ్యక్ష పదవికి సమర్ధమైన నేతృత్వం అందిస్తున్నందుకు శ్రీ మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు తెలియజేశారు.PM Modi meets with President of Indonesia
November 19th, 06:09 am
PM Modi and Indonesia’s President Prabowo Subianto met at the G20 Summit in Rio. They discussed strengthening their Comprehensive Strategic Partnership, focusing on trade, defence, connectivity, tourism, health, and people-to-people ties. Both leaders agreed to celebrate 75 years of diplomatic relations in 2024. They also exchanged views on global and regional issues, highlighting the concerns of the Global South and reviewed cooperation within G20 and ASEAN.పోర్చుగల్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 19th, 06:08 am
బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా పోర్చుగల్ ప్రధాని శ్రీ లుయిస్ మోంటెనెగ్రో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఇది ఈ నేతలిద్దరికి తొలి సమావేశం. గత ఏప్రిల్ లో పదవీ బాధ్యతలను చేపట్టిన శ్రీ మోంటెనెగ్రోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశానికి, పోర్చుగల్ కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి, విస్తరింపచేసుకోవడానికి కలసి పని చేయాలని శ్రీ మోదీ అన్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ మోంటెనెగ్రో అభినందనలు తెలియజేశారు.నార్వే ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 19th, 05:44 am
బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా నార్వే ప్రధాని శ్రీ జోనాస్ గహర్ స్టోర్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ
November 19th, 05:41 am
ద్వైపాక్షిక సంబంధాల వృద్ధి పట్ల సంతృప్తి వెల్లడించిన ఇరువురు నేతలు, భారత-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠపరచాలన్న ఇరుదేశాల నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, నూతన సాంకేతికతలు, పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ హిత పెట్టుబడులు, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాల వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నేతలు నిర్ణయించారు. సమావేశం సందర్భంగా పరస్పర ఆసక్తి గల అంశాలు సహా ముఖ్యమైన అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను ప్రధానులు ఇద్దరూ చర్చించారు.ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
November 19th, 05:26 am
2047 ప్రణాళిక, ఇతర ద్వైపాక్షిక ప్రకటనల్లో తెలిపినట్లుగా భారత్ - ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ద్వైపాక్షిక సహకారాన్ని, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో తమ నిబద్ధతను ఇరువురు నేతలు ఈ భేటీలో పునరుద్ఘాటించారు. రక్షణ, అంతరిక్షం, పౌర అణువిద్యుత్ తదితర వ్యూహాత్మక విభాగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని ప్రశంసించారు. దీనిని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దిశగా నడిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. భారతదేశ జాతీయ మ్యూజియం ప్రాజెక్టులో సహకార పురోగతిని సైతం వారు సమీక్షించారు.బ్రెజిల్‌లోని రియో డి జెనీరో చేరుకున్న ప్రధాని మోదీ
November 18th, 08:38 am
ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్‌లోని రియో డి జెనీరో చేరుకున్నారు. జీ20 సదస్సులో పాల్గొనడంతోపాటు ఈ పర్యటనలో ప్రపంచ నేతలతో భేటీ అవుతారు.నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
November 12th, 07:44 pm
నవంబర్ 16-21 తేదీల్లో నైజీరియా, బ్రెజిల్, గయానాలలో అధికారిక పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. నైజీరియాలో, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన పాల్గొంటారు. బ్రెజిల్‌లో జరిగే జీ20 సదస్సులో ఆయన పాల్గొంటారు. గయానాలో, ప్రధాన మంత్రి సీనియర్ నేతలతో చర్చలు జరుపుతారు, పార్లమెంట్‌లో ప్రసంగిస్తారు మరియు కారికొమ్-ఇండియా సమ్మిట్‌లో పాల్గొంటారు, ఇది కరీబియన్ ప్రాంతంతో సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ఉద్ఘాటిస్తుంది.సెప్టెంబర్ 25 న ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ కార్యక్రమం లో వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
September 24th, 05:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 25 న సాయంత్రం పూట జరిగే ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ కార్యక్రమం లో వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.Attackers of Uri incident would not go unpunished: PM During Mann Ki Baat
September 25th, 11:00 am
We have full faith in our soldiers. They will always give befitting reply to those spreading terrorPM Shri Narendra Modi today addressed the nation through radio program Mann Ki Baat. PM paid tributes to the 18 martyrs of Uri attack and said that we have full faith in our army. Shri Modi applauded the achievements of our Paralympic athletes in Rio 2016 Paralympics. PM also talked about the successful 2 years of Swacch Bharat Mission and encouraged citizens to participate in it in every way they can.సోషల్ మీడియా కార్నర్ -23 సెప్టెంబర్
September 23rd, 07:41 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ -14 సెప్టెంబర్
September 14th, 06:45 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!