సుగమ్య భారత్ అభియాన్‌కు 9 ఏళ్ళు: ప్రధానమంత్రి

December 03rd, 04:22 pm

సుగమ్య భారత్ అభియాన్‌ ను ప్రారంభించి నేటికి 9 సంవత్సరాలయ్యిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దివ్యాంగ సోదరీమణులకు, సోదరులకు సేవల లభ్యత, సమానత్వంతోపాటు అవకాశాలను మరింత పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. దివ్యాంగ సోదరీమణులు, సోదరులు చాటుతున్న మనస్థైర్యం, వారు సాధిస్తున్న విజయాలను శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ అవి మనమందరం గర్వపడేటట్లుగా ఉన్నాయన్నారు.