PM Modi arrives in Georgetown, Guyana
November 20th, 11:22 am
Prime Minister Narendra Modi arrived in Georgetown, Guyana. In a special gesture, he was warmly received by President Irfaan Ali, PM Mark Anthony Phillips, senior ministers and other dignitaries at the airport. During the visit, PM Modi will take part in various programmes including address to the Parliament of Guyana and an interaction with the Indian community.జార్జ్‌టౌన్‌లో ప్రధానమంత్రికి స్వాగతం పలికిన గయానా అధ్యక్షుడు
November 20th, 11:18 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 20-21 తేదీలలో గయానాలో ఆధికారిక పర్యటన నిమిత్తం ఈ రోజు జార్జ్‌టౌన్ చేరుకొన్నారు. గత 56 సంవత్సరాలలో భారతదేశ ప్రధాని గయానాను సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి విమానాశ్రయంలో గౌరవ సూచకంగా గయానా అధ్యక్షుడు డాక్టర్ మొహమద్ ఇర్ఫాన్ అలీ, గయానా ప్రధాని శ్రీ బ్రిగేడియర్ (రిటైర్డ్) మార్క్ ఆంధోనీ ఫిలిప్స్ సాదరంగా సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. గయానా ప్రభుత్వంలోని 12 మందికి పైగా కేబినెట్ మంత్రులు కూడా వారితోపాటు ఉన్నారు.నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
November 12th, 07:44 pm
నవంబర్ 16-21 తేదీల్లో నైజీరియా, బ్రెజిల్, గయానాలలో అధికారిక పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. నైజీరియాలో, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన పాల్గొంటారు. బ్రెజిల్‌లో జరిగే జీ20 సదస్సులో ఆయన పాల్గొంటారు. గయానాలో, ప్రధాన మంత్రి సీనియర్ నేతలతో చర్చలు జరుపుతారు, పార్లమెంట్‌లో ప్రసంగిస్తారు మరియు కారికొమ్-ఇండియా సమ్మిట్‌లో పాల్గొంటారు, ఇది కరీబియన్ ప్రాంతంతో సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ఉద్ఘాటిస్తుంది.పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ సందర్భం లో గుయాన అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి
January 09th, 05:31 pm
ఇందౌర్ లో పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సందర్భం లో కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గుయాన అధ్యక్షుడు డాక్టర్ శ్రీ మొహమద్ ఇర్ఫాన్ అలీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు. అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీ 2023 జనవరి 8వ తేదీ మొదలుకొని 14వ తేదీ వరకు భారతదేశం లో ఆధికారికంగా పర్యటించడానికి విచ్చేశారు. పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ కు ఆయన ముఖ్య అతిథి గా కూడా ఉన్నారు.టిఇఆర్ఐ నిర్వహించే వరల్డ్ సస్ టేనబుల్డెవలప్ మెంట్ సమిట్ లో ఫిబ్రవరి 16న ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నప్రధాన మంత్రి
February 15th, 11:32 am
ది ఎనర్జీ ఎండ్ రిసోర్సెస్ ఇన్ స్టిట్యూట్ (టిఇఆర్ఐ) నిర్వహించే వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ న సాయంత్రం పూట సుమారు 6 గంటల వేళ కు వీడియో సందేశం ద్వారా ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.