అంతర్జాతీయ సహకార సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 25th, 03:30 pm

మీ అందరికీ ఈరోజు నేను స్వాగతం పలుకుతున్నానంటే, అది నేనొక్కడిని చేసింది కాదు.. నిజానికి నేనొక్కడినే చేయలేను కూడా. భారత్ లోని లక్షలాది మంది రైతులు, లక్షలాది మంది పశుపోషకులు, దేశంలోని మత్స్యకారులు, 8 లక్షలకు పైగా సహకార సంఘాలు, స్వయంసహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలు, సహకార సంఘాలను సాంకేతికతతో అనుసంధానిస్తున్న భారత యువత తరఫున – మిమ్మల్ని నేను భారత్ కు ఆహ్వానిస్తున్నాను.

2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సుని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 25th, 03:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సును ప్రారంభించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ, భూటాన్ ప్రధానమంత్రి శ్రీ దాషో షెరింగ్ టోబ్‌గే, ఫిజీ ఉప ప్రధాన మంత్రి శ్రీ మనోవా కమికామికా, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ శ్రీ షోంబీ షార్ప్, అంతర్జాతీయ సహకార సమితి అధ్యక్షుడు శ్రీ ఏరియల్ గార్కో, విదేశీ ప్రముఖులు తదితరులకు శ్రీ మోదీ స్వాగతం పలికారు.

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం

August 30th, 12:00 pm

ఇటీవలే జన్మాష్టమిని జరుపుకున్న దేశం ప్రస్తుతం పండుగ వాతావరణం లో ఉంది. మన ఆర్థిక వ్యవస్థలోనూ, మార్కెట్లలోనూ పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంబర వాతావరణంలోనే మనం గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాం, అలాంటి కార్యక్రమానికి కలల నగరమైన ముంబై కంటే మంచి ప్రదేశం ఏముంటుంది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం. ఇక్కడికి రాకముందు వివిధ ప్రదర్శనలను సందర్శించే అవకాశం, పలువురు మిత్రులతో మమేకమయ్యే అవకాశం లభించింది. అక్కడ, మన యువత నాయకత్వంలో, భవిష్యత్తు అవకాశాలతో నిండిన కొత్త ఆవిష్కరణల ప్రపంచాన్ని నేను చూశాను. మీ పనికి అనుగుణంగా, మరో మాటలో చెప్పాలంటే: నిజంగా ఒక కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోంది. ఈ ఉత్సవ నిర్వాహకులను, పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను.

ముంబైలో గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌(జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

August 30th, 11:15 am

మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో ఉన్న జియో వ‌రల్డ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఇవాళ జ‌రిగిన గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ (జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను సైతం ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ క‌న్వ‌ర్జెన్స్ కౌన్సిల్ క‌లిసి జీఎఫ్ఎఫ్‌ను సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఫిన్‌టెక్ రంగంలో భార‌త్ సామ‌ర్థ్యాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు ఈ రంగంలోని కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ఒక్క‌చోట‌కు చేర్చ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం.

అణగారిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమే NDA ప్రభుత్వ అభివృద్ధి నమూనా: ప్రధాని మోదీ

July 13th, 06:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని ముంబైలో రూ. 29,400 కోట్లకు పైగా విలువైన రోడ్డు, రైల్వేలు మరియు ఓడరేవుల రంగానికి సంబంధించిన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, ముంబై మరియు సమీప ప్రాంతాల మధ్య రోడ్డు మరియు రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి 29,400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు అంకితం చేసే అవకాశం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

మహారాష్ర్టలోని ముంబైలో రూ.29,400 కోట్లకు పైగా విలువ గల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

July 13th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ర్టలోని ముంబైలో శనివారం రూ.29,400 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. వీటిలో రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులున్నాయి.

గుర్తింపు, తీర్మానం మరియు మూలధనీకరణ వ్యూహంపై ప్రభుత్వం పని చేసింది: ప్రధాని మోదీ

April 01st, 11:30 am

మహారాష్ట్రలోని ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్బీఐ@90 అనే కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే దశాబ్దం విక్షిత్ భారత్ యొక్క తీర్మానాలకు చాలా ముఖ్యమైనది”, విశ్వాసం మరియు స్థిరత్వంపై వేగవంతమైన వృద్ధిపై దృష్టి సారించడం పట్ల ఆర్బీఐ యొక్క ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ పీఎం మోదీ అన్నారు. సంస్క‌ర‌ణ‌ల స‌మ‌గ్ర స్వ‌భావాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, గుర్తింపు, ప‌రిష్కారం, రీక్యాపిట‌లైజేషన్ వ్యూహంపై ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని అన్నారు.

ఆర్‌బిఐ @90 ప్రారంభ వేడుక‌ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి

April 01st, 11:00 am

మహారాష్ట్రలోని ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్బీఐ@90 అనే కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే దశాబ్దం విక్షిత్ భారత్ యొక్క తీర్మానాలకు చాలా ముఖ్యమైనది”, వేగవంతమైన వృద్ధి మరియు విశ్వాసం మరియు స్థిరత్వంపై దృష్టి సారించడం పట్ల ఆర్బీఐ యొక్క ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ పీఎం మోదీ అన్నారు. సంస్క‌ర‌ణ‌ల స‌మ‌గ్ర స్వ‌భావాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, గుర్తింపు, ప‌రిష్కారం, రీక్యాపిట‌లైజేషన్ వ్యూహంపై ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని అన్నారు.

‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2023’లో ‘ఆర్‌బిఐ’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు “ఎ+” రేటింగ్ లభించడంపై ప్రధానమంత్రి అభినందన

September 01st, 10:53 pm

గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2023లో భారత రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శ్రీ శక్తికాంత దాస్‌కు “ఎ+” ర్యాంకు లభించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సంస్థ రేటింగ్ పొందిన ముగ్గురు కేంద్రీయ బ్యాంకు గవర్నర్లలో శ్రీ దాస్ “ఎ+”తో అగ్రస్థానంలో నిలిచారు.

1514 పట్టణ సహకార బాంకుల పటిష్టానికి రిజర్వ్ బాంక్ ఆదేశించటాన్ని స్వాగతించిన ప్రధాని

June 10th, 04:03 pm

1514 పట్టణ సహకార బాంకులను పటిష్టపరచటానికి రిజర్వ్ బాంక్ ఆదేశించటాన్ని స్వాగతిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇలా ట్వీట్ చేశారు:

సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్ స్ 2023 లో భాగం గా ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకొన్నందుకు ఆర్ బిఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కుఅభినందనలను తెలియజేసిన ప్రధాన మంత్రి

March 17th, 07:00 am

సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్ స్ 2023 లో ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం తో ఆర్ బిఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ ను సమ్మానించిన సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.

వర్చువల్ మాధ్యం ద్వారా భారతదేశాని కి మరియు సింగపూర్ కు మధ్య యుపిఐ-పేనౌలింకేజీని ప్రారంభించే కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీమరియు సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్

February 21st, 11:00 am

భారతదేశాని కి చెందిన యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) కి మరియు సింగపూర్ కు చెందిన పేనౌ కు మధ్య రియల్ టైమ్ పేమెంట్ లింకేజి ని వర్చువల్ మాధ్యం ద్వారా ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ లు పాల్గొన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నరు శ్రీ శక్తికాంత్ దాస్ తో పాటు మానిటరి ఆథారిటి ఆఫ్ సింగపూర్ యొక్క మేనేజింగ్ డైరెక్టరు శ్రీ రవి మేనన్ వారి వారి మొబైల్ ఫోన్ లను ఉపయోగిస్తూ ఒకరితో మరొకరు లైవ్ క్రాస్ బార్డర్ లావాదేవీ ని పూర్తి చేశారు.

రూపే డెబిట్ కార్డ్‌లు మరియు తక్కువ-విలువైన భీం - యూ పీ ఐ (BHIM-UPI) లావాదేవీల ( వ్యక్తి నుండి వ్యాపారి - P2M) వృద్ధి కోసం ప్రోత్సాహక పథకాన్ని క్యాబినెట్ ఆమోదించింది.

January 11th, 03:30 pm

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం, 2022 ఏప్రిల్ నుండి ఒక సంవత్సరం పాటు రూపే డెబిట్ కార్డ్‌లు మరియు తక్కువ-విలువ భీం - యూ పీ ఐ లావాదేవీల (వ్యక్తి నుండి వ్యాపారి) వ్యాప్తి కోసం ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. .

Today's new India emphasizes on solving problems rather than avoiding them: PM Modi

December 12th, 10:43 am

Prime Minister Narendra Modi addressed a function on “Depositors First: Guaranteed Time-bound Deposit Insurance Payment up to Rs. 5 Lakh” in New Delhi. He said, Banks play a major role in the prosperity of the country. And for the prosperity of the banks, it is equally important for the depositors' money to be safe. If we want to save the bank, then depositors have to be protected.

ధిల్లీలో జ‌రిగిన బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించిన ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

December 12th, 10:27 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ డిపాజిట‌ర్ల‌కు అగ్ర‌ప్రాధాన్యం- నిర్దిష్ట గ‌డువుతో 5 ల‌క్ష‌ల రూపాయాల వ‌ర‌కు న‌మ్మ‌క‌మైన డిపాజిట్ ఇన్సూరెన్సు చెల్లింపు న‌కు సంబంధించి ఢిల్లీలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. కేంద్ర ఆర్థిక శాఖ‌మంత్రి , కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి, రిజ‌ర్వు బ్యాంకు గ‌వ‌ర్న‌ర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కొంత‌మంది డిపాజిట‌ర్ల‌కు ప్ర‌ధానంత్రి చెక్కులు పంపిణీ చేశారు.

'సీమ్‌లెస్ క్రెడిట్ ఫ్లో అండ్ కోఆర్డినేటింగ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్' అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

November 18th, 12:31 pm

దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ జీ, ఆర్థిక శాఖ సహాయ మంత్రులు శ్రీ పంకజ్ చౌదరి జీ మరియు డాక్టర్ భగవత్ కరద్ జీ, ఆర్ బి ఐ గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ జీ, బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రముఖులు, భారతీయ పరిశ్రమలోని గౌరవనీయ సహచరులు, కార్యక్రమానికి సంబంధించిన ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్ మెన్,

‘క్రియేటింగ్ సినర్జీస్ ఫార్ సీమ్ లెస్ క్రెడిట్ ఫ్లో ఎండ్ ఇకానామిక్ గ్రోథ్’ అంశం పై జరిగిన సమావేశాన్ని ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి

November 18th, 12:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘క్రియేటింగ్ సినర్జీస్ ఫార్ సీమ్ లెస్ క్రెడిట్ ఫ్లో ఎండ్ ఇకానామిక్ గ్రోథ్’ అంశం పై జరిగిన సమావేశం ముగింపు సదస్సు ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన రెండు వినూత్న కస్టమర్ సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

November 12th, 11:01 am

இந்திய ரிசர்வ் வங்கியின், வாடிக்கையாளர்களை மையப்படுத்திய இரண்டு புதிய கண்டுபிடிப்பு முன்முயற்சிகளை, அதாவது நேரடி சிறு முதலீட்டுத் திட்டம், ரிசர்வ் வங்கியின் ஒருங்கினைக்கப்பட்ட குறைதீர்ப்புத் திட்டம் ஆகியவற்றை இன்று பிரதமர் திரு நரேந்திர மோடி காணொலி காட்சி மூலம் தொடங்கிவைத்தார். மத்திய நிதி மற்றும் கார்பரேட் விவகாரங்கள் துறை அமைச்சர் திருமதி நிர்மலா சீதாராமன், இந்திய ரிசர்வ் வங்கி கவர்னர் திரு சக்திகாந்த தாஸ் ஆகியோர் இந்த நிகழ்வில் உடன் இருந்தனர்.

వినియోగదారు ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకొని ఆర్ బిఐ రూపొందించినరెండు కొత్త కార్యక్రమాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

November 12th, 11:00 am

వినియోగదారు ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకొని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్ బిఐ) రూపొందించిన రెండు కొత్త కార్యక్రమాలు అయిన రిటైల్ డైరెక్ట్ స్కీము ను, రిజర్వ్ బ్యాంకు- ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కిము ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఆర్థిక వ్యవహారాలు మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ తో పాటు ఆర్ బిఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కూడా పాలుపంచుకొన్నారు.

ఈ నెల 5 న వ‌ర్చువ‌ల్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ రౌండ్ టేబుల్ కు అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

November 03rd, 06:15 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 5 న వ‌ర్చువ‌ల్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ రౌండ్ టేబుల్ (విజిఐఆర్‌) స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశాన్ని ఆర్థిక శాఖ, నేశ‌న‌ల్ ఇన్ వెస్ట్‌మెంట్ ఎండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫండ్ లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్య‌క్ర‌మం లో ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్ర‌ముఖ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారు సంస్థ‌లు, భార‌త‌దేశం లోని వ్యాపార రంగ ప్ర‌ముఖులు, భార‌త ప్ర‌భుత్వంలో అత్యున్న‌త విధాన నిర్ణేత‌లతో పాటు ఆర్థిక విపణి సంబంధి