ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని ప్ర‌యాగ్ రాజ్ లో 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వరి 29వ తేదీ న నిర్వ‌హించే ఒక భారీ పంపిణీ శిబిరం లో వ‌యోవృద్ధుల‌ కు మ‌రియు దివ్యాంగ‌ జ‌నుల‌ కు నిత్యజీవనం లో ఉప‌యోగ‌ప‌డే ప‌రిక‌రాల ను మరియు సాధనాలను అంద‌జేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి

February 27th, 06:33 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 29వ తేదీ నాడు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని ప్ర‌యాగ్ రాజ్ లో ఒక భారీ పంపిణీ శిబిరం లో పాల్గొని, రాష్ట్రీయ వ‌యోశ్రీ యోజ‌న (ఆర్‌వివై) లో భాగం గా వ‌యోవృద్ధు ల‌కు స‌హాయ‌క ఉప‌క‌ర‌ణాల ను, ఎడిఐపి ప‌థ‌కం లో భాగం గా దివ్యాంగ జ‌నుల కు సహాయక ఉపకరణాల ను అంద‌జేయ‌నున్నారు.