ఎన్ సిసి దినం నాడుఎన్ సిసి కేడెట్స్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
November 28th, 06:14 pm
ఎన్ సిసి దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ సిసి కేడెట్స్ కు అభినందనలు తెలిపారు. భారతదేశం అంతటా ఉన్నటువంటి ఎన్ సిసి పూర్వ విద్యార్థులు ఎన్ సిసి పూర్వ విద్యార్థుల సంఘం యొక్క కార్యకలాపాల లో పాలుపంచుకొంటూ ఉండాలని, అంతేకాకుండా, వారి సమర్ధన ద్వారా ఆ సంఘాన్ని వర్ధిల్లేటట్లు చేయాలని శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో 'రాష్ట్ర రక్ష సమర్పణ్ పర్వ్'లో ప్రధాన మంత్రి ప్రసంగపాఠం
November 19th, 05:39 pm
ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్, శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ శక్తివంతమైన కర్మయోగి ముఖ్యమంత్రి, శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, దేశ రక్షణ మంత్రి మరియు ఈ రాష్ట్ర విజయవంతమైన ప్రతినిధి మరియు నా సీనియర్ సహోద్యోగి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ జీ, ఎం.ఎస్.ఎం.ఈ సహాయ మంత్రి శ్రీ భానుప్రతాప్ వర్మ జీ, ఇతర అధికారులు, NCC క్యాడెట్‌లు మరియు పూర్వ విద్యార్థులు మరియు సహచరులు హాజరయ్యారు!ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ‘రాష్ట్ర రక్షా సంపర్పణ్ పర్వ్’లో పాల్గొన్న ప్రధానమంత్రి
November 19th, 05:38 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నిర్వహించిన 'రాష్ట్ర రక్షా సంపర్పణ్ పర్వ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఝాన్సీ కోట ప్రాంగణంలో ఘనంగా సాగిన ఈ వేడుకల సందర్భంగా రక్షణశాఖకు సంబంధించిన అనేక వినూత్న కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ‘ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల సంఘం’ ఒకటి కాగా, ప్రధానమంత్రి అందులో తొలి సభ్యులుగా నమోదయ్యారు. అలాగే ఎన్‌సీసీ కేడెట్ల కోసం ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ సిమ్యులేషన్ ట్రైనింగ్’; జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించే ‘కియోస్క్’; భారత నావికాదళ నౌకల కోసం డీఆర్‌డీవో రూపొందించి-తయారుచేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ కవచం ‘శక్తి’; తేలికపాటి యుద్ధ హెలికాప్టర్-డ్రోన్లు తదితరాలను ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్ పరిధిలోని ఝాన్సీ విభాగంలో రూ.400 కోట్ల ‘భారత్ డైనమిక్స్ లిమిటెడ్’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.