ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించిన ప్రధానమంత్రి
November 19th, 08:41 am
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు. భయమంటే ఏమిటో ఎరుగని ఆమె, ధైర్యానికీ, సాహసానికీ, దేశభక్తికీ నిజమైన ప్రతీకగా నిలిచారంటూ ప్రధాని ప్రశంసించారు.న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి క్యాడెట్స్ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 27th, 05:00 pm
కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ అజయ్ భట్ గారు, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, త్రివిధ దళాల అధిపతులు, రక్షణ కార్యదర్శి, డిజి ఎన్ సిసి, అందరూ విశిష్ట అతిథులు మరియు ఎన్ సిసి నుండి నా యువ కామ్రేడ్ లు!ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని
January 27th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించారు. శ్రీ మోదీ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. బెస్ట్ క్యాడెట్ అవార్డులను ప్రదానం చేశారు. ఎన్‌సీసీ బాలికల మెగా సైక్లోథాన్, ఝాన్సీ నుండి ఢిల్లీ వరకు నారీ శక్తి వందన్ రన్ (ఎన్ఎస్ఆర్వి) లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తాను ఒక మాజీ ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్నందున, వాటిలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు రావడం సహజమని అన్నారు. “ ఎన్‌సీసీ క్యాడెట్‌ల మధ్య ఉండటం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆలోచనను హైలైట్ చేస్తుంది”, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్యాడెట్‌లను చూసిన సందర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. ఎన్‌సిసి రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందని సంతోషం వ్యక్తం చేసిన ఆయన, నేటి సందర్భం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వైబ్రంట్ విలేజెస్ పథకం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సరిహద్దు ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా గ్రామాల సర్పంచ్‌లు, దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు ఉన్నారని ఆయన గుర్తించారు.రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధాని నివాళి
November 19th, 11:11 am
భారత నారీశక్తి ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణీ లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు హృదయపూర్వక నివాళి అర్పించారు.రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకున్న ప్రధానమంత్రి
November 19th, 08:58 am
రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను స్మరించుకున్నారు. ఆమె ధైర్యసాహసాలు, దేశం కోసం చేసిన అనిర్వచనీయ త్యాగం చిరస్మరణీయమని శ్రీ మోదీ అన్నారు.76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 02:30 pm
76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
August 15th, 07:01 am
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ మహత్తర సందర్భంగా నా ప్రియమైన దేశప్రజలకు శుభాకాంక్షలు. అందరికీ చాలా అభినందనలు! మన త్రివర్ణ పతాకాన్ని భారతదేశం నలుమూలల్లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా తమ దేశాన్ని అమితంగా ప్రేమించే భారతీయులు గర్వంగా, గౌరవంగా మరియు కీర్తితో ఆవిష్కరింపజేయడం చాలా సంతోషాన్నిస్తుంది. భారతదేశాన్ని ప్రేమించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన స్వాతంత్య్రాన్ని జరుపుకునే ఈ అమృత్ మహోత్సవ్ పండుగ సందర్భంగా నా ప్రియమైన భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు చారిత్రక ప్రాధాన్యత కలిగిన రోజు. కొత్త సంకల్పంతో, కొత్త బలంతో కొత్త మార్గంలో ముందుకు సాగడానికి ఇది ఒక శుభ సందర్భం.భారతదేశం 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది
August 15th, 07:00 am
ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ భారతదేశ బలం భిన్నత్వంలోనే ఉందని ఉద్ఘాటించారు. అతను దేశాన్ని ప్రజాస్వామ్య మాతగా పేర్కొన్నాడు మరియు 'అమృత్ కాల్' యొక్క 'పంచప్రాణ్'ను పేర్కొన్నాడు - అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క లక్ష్యం, వలసవాద మనస్తత్వం యొక్క ఏదైనా జాడను తొలగించి, మన మూలాలు, ఐక్యత మరియు కర్తవ్య భావం గురించి గర్వపడండి.బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ
August 13th, 11:31 am
మీ అందరితో ప్రత్యక్షం గా మాట్లాడడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది కానీ అందరితో మాట్లాడడం సాధ్యం కాదు. కానీ మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. లేదా ఏదైనా సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నా ఇంటికి కుటుంబ సభ్యుడిలా రావడానికి సమయం కేటాయించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు సాధించిన విజయాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ విషయంలో మీతో సహకరించగలిగినందుకు నేను కూడా గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం.కామన్‌వెల్త్ గేమ్స్-2022 భారత బృందానికి ప్రధానమంత్రి సత్కారం
August 13th, 11:30 am
కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)-2022లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో సత్కరించారు. వివిధ క్రీడల్లో పోటీపడిన క్రీడాకారులు, వారి శిక్షకులతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలు, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన ఈ క్రీడలలో భారతదేశానికి వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు లభించాయి. ఈ మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను ప్రధానమంత్రి అభినందించారు. సీడబ్ల్యూజీ-2022లో క్రీడాకారుల, శిక్షకుల ప్రతిభా ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సాధించిన విజయాలు తమకు గర్వకారణమని అభివర్ణించారు. క్రీడాకారుల అద్భుత కృషి వల్ల దక్కిన అద్భుత విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రవేశించడం గర్వించదగిన అంశమని ప్రధాని పేర్కొన్నారు.ఇది భారతదేశ వృద్ధి కథ యొక్క మలుపు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 28th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం! ఈ రోజు మనం 'మన్ కీ బాత్' కోసం మరోసారి కలిశాం. రెండు రోజుల తర్వాత డిసెంబరు నెల కూడా మొదలవుతోంది. డిసెంబరు రాగానే సంవత్సరం గడిచిపోయినట్టే అనిపిస్తుంది. ఏడాదికి చివరి నెల కావడంతో కొత్త ఏడాదికి పునాదులు వేసుకుంటాం. దేశం అదే నెలలో నౌకా దళ దినోత్సవాన్ని,సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది. డిసెంబర్ 16వ తేదీన దేశం 1971 యుద్ధ స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భాలలోనేను దేశంలోని భద్రతా దళాలను గుర్తుకు తెచ్చుకుంటాను. మన వీరులను స్మరించుకుంటాను. అలాంటి వీరులకు జన్మనిచ్చిన ధైర్యవంతులైన తల్లులను గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పటిలాగేఈసారి కూడా నమో యాప్ ద్వారానూ మీ గవ్ ద్వారానూ మీ అందరి నుండి నాకు చాలా సూచనలు వచ్చాయి.మీరు నన్ను మీ కుటుంబంలో ఒక భాగంగా భావించి మీ జీవితంలోని సంతోషాలను, బాధలను పంచుకున్నారు. ఇందులో చాలా మంది యువకులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు. మన'మన్ కీ బాత్' కుటుంబం నిరంతరం అభివృద్ధి చెందుతుండడం నాకు సంతోషంగా ఉంటోంది. ఈ కార్యక్రమం మనస్సులతో అనుసంధానమవుతోంది. లక్ష్యాలతో అనుసంధానమవుతోంది. మన మధ్య లోతైన సంబంధంతో మనలో సానుకూల దృక్పథం నిరంతరం ప్రవహిస్తోంది.ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో 'రాష్ట్ర రక్ష సమర్పణ్ పర్వ్'లో ప్రధాన మంత్రి ప్రసంగపాఠం
November 19th, 05:39 pm
ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్, శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ శక్తివంతమైన కర్మయోగి ముఖ్యమంత్రి, శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, దేశ రక్షణ మంత్రి మరియు ఈ రాష్ట్ర విజయవంతమైన ప్రతినిధి మరియు నా సీనియర్ సహోద్యోగి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ జీ, ఎం.ఎస్.ఎం.ఈ సహాయ మంత్రి శ్రీ భానుప్రతాప్ వర్మ జీ, ఇతర అధికారులు, NCC క్యాడెట్‌లు మరియు పూర్వ విద్యార్థులు మరియు సహచరులు హాజరయ్యారు!ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ‘రాష్ట్ర రక్షా సంపర్పణ్ పర్వ్’లో పాల్గొన్న ప్రధానమంత్రి
November 19th, 05:38 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నిర్వహించిన 'రాష్ట్ర రక్షా సంపర్పణ్ పర్వ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఝాన్సీ కోట ప్రాంగణంలో ఘనంగా సాగిన ఈ వేడుకల సందర్భంగా రక్షణశాఖకు సంబంధించిన అనేక వినూత్న కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ‘ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల సంఘం’ ఒకటి కాగా, ప్రధానమంత్రి అందులో తొలి సభ్యులుగా నమోదయ్యారు. అలాగే ఎన్‌సీసీ కేడెట్ల కోసం ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ సిమ్యులేషన్ ట్రైనింగ్’; జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించే ‘కియోస్క్’; భారత నావికాదళ నౌకల కోసం డీఆర్‌డీవో రూపొందించి-తయారుచేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ కవచం ‘శక్తి’; తేలికపాటి యుద్ధ హెలికాప్టర్-డ్రోన్లు తదితరాలను ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్ పరిధిలోని ఝాన్సీ విభాగంలో రూ.400 కోట్ల ‘భారత్ డైనమిక్స్ లిమిటెడ్’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.రాణీ లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ఆమెకు ప్రధానమంత్రి అభివందనం
November 19th, 10:31 am
రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు.ఇల్లు, విద్యుత్తు, టాయిలెట్లు, గ్యాస్, రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి ప్రాథమిక సౌకర్యాల లేమి మహిళల పైన, మరీ ముఖ్యం గా పేద మహిళల పైనప్రభావాన్ని చూపింది: ప్రధాన మంత్రి
August 10th, 10:43 pm
ఇంటి పై కప్పు నీటి చుక్కల తో కారుతూ ఉండడం, విద్యుత్తు సౌకర్యం లేకపోవడం, కుటుంబం లో సభ్యులు జబ్బు పడుతూ ఉండడం, బహిర్భూమి కి వెళ్లి రావడం కోసం చీకటి పడే వరకు వేచి ఉండవలసి రావడం, బడుల లో మరుగుదొడ్డి సదుపాయం కొరవడటం అనేవి మన మాతృమూర్తుల పై, మన పుత్రికల పై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింపచేస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మన మాతృమూర్తులు పొగ, వేడిమి ల బారిన పడి సతమతం కావడాన్ని మన తరం గమనిస్తూ వచ్చిందని చెబుతూ ఆయన తన స్వీయ అనుభవాన్ని గురించి ప్రస్తావించారు.ఉజ్జ్వల యోజన ద్వారా ప్రజల జీవితాలు, ముఖ్యంగా వెలుగులు నింపిన మహిళల సంఖ్య అపూర్వమైనది: ప్రధాని మోదీ
August 10th, 12:46 pm
ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహోబా ఉత్తర ప్రదేశ్‌లో ఎల్పిజి కనెక్షన్లను అందజేయడం ద్వారా ప్రధాని మోదీ ఉజ్వల యోజన 2.0 ని ప్రారంభించారు. సోదరీమణుల ఆరోగ్యం, సౌలభ్యం మరియు సాధికారత నిర్ణయం ఉజ్జ్వల యోజన నుండి గొప్ప ప్రోత్సాహాన్ని పొందాయని ప్రధాన మంత్రి గుర్తించారు. ఈ పథకం మొదటి దశలో 8 కోట్ల మంది పేద, దళిత, వెనుకబడిన మరియు గిరిజన కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయి.ఉజ్జ్వల 2.0 ను ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా నుంచి ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 10th, 12:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో ఎల్ పీజీ కనెక్షన్ లను లబ్ధిదారుల కు అప్పగించి, ‘ఉజ్జ్వల 2.0’ (ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన - (పిఎమ్ యువై) ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఉజ్జ్వల లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.భారతదేశ స్వాతంత్య్ర సమరం లో పాలుపంచుకొన్న మహానుభావుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
March 12th, 03:21 pm
స్వాతంత్య్ర యోధులు అందరికీ, ఉద్యమాలకు, అలజడి లకు, స్వాతంత్య్ర ఉద్యమ సంఘర్షణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ప్రత్యేకించి భారతదేశ భవ్య స్వాతంత్య్ర సమర గాథ లో లభించవలసినంతటి గుర్తింపు లభించని ఉద్యమాల కు, పోరాటాల కు, విశిష్ట వ్యక్తుల కు శ్రద్ధాంజలి అర్పించారు. అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం లో ఈ రోజు న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) ను ప్రారంభించిన అనంతరం ఆయన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 12th, 10:31 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర యాత్ర) ప్రారంభానికి గుర్తు గా పచ్చ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) కార్యక్రమాల ను ప్రారంభించారు. India@75 ఉత్సవాలకై ఉద్దేశించినటువంటి ఇతర విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ India@75 కార్యక్రమాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 12th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర యాత్ర) ప్రారంభానికి గుర్తు గా పచ్చ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) కార్యక్రమాల ను ప్రారంభించారు. India@75 ఉత్సవాలకై ఉద్దేశించినటువంటి ఇతర విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.