ఐదు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి

June 27th, 10:17 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లో ఐదు వందేభారత్‌ ఎక్స్‌’ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలోని భోపాల్‌లో రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ నుంచి భోపాల్-ఇండోర్; భోపాల్-జబల్పూర్ మార్గాలతోపాటు రాంచీ-పట్నా; ధార్వాడ్-బెంగళూరు; గోవా (మడ్గావ్)-ముంబై మార్గాల్లో మరో మూడు వందేభారత్‌ ఎక్స్‌’ప్రెస్‌లను ఆయన సాగనంపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాణి కమలాపతి స్టేషన్‌లో భోపాల-ఇండోర్‌ వందేభారత్‌ రైలులో తొలి బోగీని ప్రధాని పరిశీలించారు. అలాగే ఆ పెట్టలోని పిల్లలతోపాటు రైలు చోదక సిబ్బందితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.

అజ్మీర్, ఢిల్లీ కంటోన్మెంట్ లను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంబిస్తున్నప్పుడు ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 12th, 11:01 am

భారత మాత ని ఆరాధించే రాజస్థాన్ భూమి ఈ రోజు మొదటి వందే భారత్ రైలును పొందుతోంది. ఢిల్లీ కంటోన్మెంట్-అజ్మీర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో, జైపూర్ మరియు ఢిల్లీ మధ్య ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ రైలు రాజస్థాన్ పర్యాటక రంగానికి కూడా ఎంతో సహాయం చేస్తుంది. అది పుష్కర్ అయినా, అజ్మీర్ షరీఫ్ అయినా, భక్తులు చాలా ముఖ్యమైన విశ్వాస స్థలాలకు చేరుకోవడం సులభం అవుతుంది.

జైపూర్-ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య రాజస్థాన్‌ తొలి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి

April 12th, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్ తొలి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌’ను వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. శౌర్యప్రతాపాల పురిటిగడ్డ రాజస్థాన్‌కు తొలి వందే భారత్‌ రైలు రావడంపై రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇది జైపూర్‌-ఢిల్లీ నగరాల మధ్య ప్రయాణ సౌలభ్యం కల్పించడంతోపాటు తీర్థరాజ్‌ పుష్కర్‌, అజ్మీర్‌ షరీఫ్‌ వంటి భక్తివిశ్వాస నిలయాలను చేరువ చేస్తుందన్నారు. తద్వారా రాజస్థాన్‌లో పర్యాటక పరిశ్రమకు ఊపునిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత రైలుసహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ రెండు నెలల వ్యవధిలో తాను 6వ వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ముంబై-షోలాపూర్‌, ముంబై-షిరిడి, రాణి కమలాపతి-హజ్రత్‌ నిజాముద్దీన్‌, సికింద్రాబాద్‌-తిరుపతి, చెన్నై-కోయంబత్తూరు మార్గాల్లో వందే భారత్‌ రైళ్లను ప్రారంభించానని గుర్తుచేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

November 25th, 01:06 pm

ఉత్తరప్రదేశ్ ప్రముఖ, కర్మయోగి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, మా పాత శక్తివంతమైన సహచరుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, జనరల్ వీకే సింగ్ జీ, సంజీవ్ బల్యాన్ జీ, ఎస్పీ సింగ్ బఘేల్ జీ మరియు బి ఎల్ వర్మ జీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, శ్రీ లక్ష్మీ నారాయణ్ చౌదరి జీ, శ్రీ జై ప్రతాప్ సింగ్ జీ, శ్రీకాంత్ శర్మ జీ, భూపేంద్ర చౌదరి జీ, శ్రీ నందగోపాల్ గుప్తా జీ, అనిల్ శర్మ జీ, ధరమ్ సింగ్ సైనీ జీ, అశోక్ కటారియా జీ మరియు శ్రీ జి ఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు డా. మహేశ్ శర్మ జీ, శ్రీ సురేంద్ర సింగ్ నగర్ జీ మరియు శ్రీ భోలా సింగ్ జీ, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ధీరేంద్ర సింగ్ జీ, వేదికపై కూర్చున్న ఇతర ప్రజాప్రతినిధులందరూ మరియు మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా.

ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 25th, 01:01 pm

ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ శ్రీ వి.కె. సింహ్, శ్రీ సంజీవ్ బాలియాన్, శ్రీ ఎస్.పి సింహ్ బఘెల్, శ్రీ బి.ఎల్. వర్మ లు ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వివిధ రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

November 15th, 03:21 pm

మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ జీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జీ, కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ, ఇక్కడికి హాజరైన ఇతర ప్రముఖులు మరియు సోదర సోదరీమణులారా,

మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో వివిధ రైల్ వే పథకాల ను దేశ ప్రజల కు అంకితంచేసిన ప్రధాన మంత్రి

November 15th, 03:20 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని భూపాల్ లో వేరు వేరు రైల్ వే ప్రాజెక్టుల ను ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేశారు. పునర్ అభివృద్ధి పరచిన భూపాల్ లోని రాణి కమలాపతి రైల్ వే స్టేశన్ ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. గేజ్ మార్పిడి జరిగిన మరియు విద్యుతీకరణ పని పూర్తి అయిన ఉజ్జయిని-ఫతేహాబాద్ చంద్రావతిగంజ్ బ్రాడ్ గేజ్ సెక్శను ను, భోపాల్-బాడ్ ఖేరా సెక్శన్ లో మూడో మార్గాన్ని, విద్యుతీకరణ జరిగిన మాతేలా-నిమర్ ఖేరీ బ్రాడ్ గేజ్ సెక్శన్ ను మరియు విద్యుతీకరణ జరిగిన గుణ-గ్వాలియర్ సెక్శన్ లు సహా రైల్ వేల కు చెందిన అనేక ఇతర కార్యక్రమాల ను కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్జయిని-ఇందౌర్ మధ్య మరియు ఇందౌర్-ఉజ్జయిని మధ్య కొత్త గా రెండు ఎమ్ఇఎమ్ యు.. ‘మెము’ (MEMU) ట్రయిన్ లకు ప్రారంభ సూచకంగా ఆకుపచ్చని జెండా ను చూపెట్టారు. ఈ సందర్భం లో మధ్య ప్రదేశ్ గవర్నర్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర రైల్ వే శాఖ కేంద్ర మంత్రి పాలుపంచుకున్నారు.

భోపాల్‌లో పునర్నిర్మించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని

November 14th, 04:41 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 15న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న సందర్భంగా పునర్నిర్మించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. గోండు రాజ్యాన్నేలిన సాహస వనిత, భయమంటే ఏమిటో ఎరుగని రాణి కమలాపతి పేరిట పునర్నిర్మితమైన ‘రాణి కమలాపతి రైల్వే స్టేషన్’ మధ్యప్రదేశ్‌లోని తొలి అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్ కావడం విశేషం. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం నమూనాతో పునర్నిర్మించిన ఈ స్టేషన్‌ ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హరిత సౌధంగా తీర్చిదిద్దబడింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణంలో దివ్యాంగుల రాకపోకల సౌలభ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ స్టేషన్‌ను సమీకృత బహుళ-రవాణా సదుపాయ కేంద్రంగానూ రూపొందించారు.

జనజాతీయ గౌరవ దినోత్సవం నేపథ్యంలో నవంబరు 15న ప్రధానమంత్రి మధ్యప్రదేశ్‌ సందర్శన

November 14th, 04:40 pm

అమర వీరుడు భగవాన్ బిర్సా ముండా జన్మదినమైన నవంబర్ 15వ తేదీని కేంద్ర ప్రభుత్వం ‘జనజాతీయ గౌరవ దినోత్సవం’గా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా భోపాల్‌లోని జంబూరి మైదానంలో నిర్వహించే ‘జనజాతీయ గౌరవ దినోత్సవ’ మహా సమ్మేళనంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌ను సందర్శిస్తారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం ఒంటిగంటకు జనజాతీయ సమాజ సంక్షేమానికి ఉద్దేశించిన పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు.