స్థానిక బొమ్మల కు ఖ్యాతి దక్కడం కోసం ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ‘మన్ కీ బాత్’ లో చెప్పిన ప్రధాన మంత్రి
August 30th, 03:43 pm
పిల్లల కు కొత్త కొత్త ఆటబొమ్మల ను అందుబాటు లోకి తీసుకురావడం మరియు భారతదేశం ఏ విధం గా బొమ్మల ఉత్పత్తి కేంద్రం గా మారగలదనే అంశాల పై చిల్డ్రన్ యూనివర్సిటీ ఆఫ్ గాంధీ నగర్ తో, కేంద్ర మహిళా మరియు శిశు వికాసం మంత్రిత్వ శాఖ తో మరియు ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ తో తాను జరిపిన చర్చోపచర్చల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) తాజా ప్రసంగం లో వెల్లడించారు. ఆటవస్తువులు చురుకుదనాన్ని పెంచడం ఒక్కటే కాకుండా, మన మహత్త్వాకాంక్షల కు రెక్కల ను కూడా తొడుగుతాయని ఆయన అన్నారు. ఆటబొమ్మలు కేవలం వినోదాన్నే అందించవు, అవి వినోదం తో పాటు మన మేధో వికాసానికి తోడ్పడుతాయి, అలాగే ఆటబొమ్మలు మన సంకల్పాన్ని కూడా ప్రోత్సహిస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు.