పాలస్తీనా లో పర్యటించిన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఫిబ్రవరి 10, 2018)
February 10th, 04:36 pm
రామల్లాహ్ కు ఒక భారతదేశ ప్రధాన మంత్రి మొట్టమొదటిసారిగా రావడం ఎంతో సంతోషదాయకమైన విషయం.పాలస్తీనా ప్రెసిడెంట్ భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన
May 16th, 02:50 pm
భారతదేశానికి పాత స్నేహితులలో ఒకరైన ప్రెసిడెంట్ శ్రీ మహమూద్ అబ్బాస్ భారతదేశానికి ఆధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన వేళ ఆయనకు మరో సారి స్వాగతం పలకడం నాకు ఆనందాన్నిస్తోంది. భారతదేశం మరియు పాలస్తీనాల మధ్య ఏర్పడిన సంబంధం మన సొంత స్వాతంత్య్ర సమరం రోజుల నాటి నుండి వేసుకున్న దీర్ఘకాలిక సంఘీభావం మరియు మిత్రత్వాల పునాదిపైన నిర్మితమైంది. పాలస్తీనా మనోరథం నెరవేరడం కోసం భారతదేశం నిలకడగా తన మద్దతును అందిస్తూ వచ్చింది. ఒక సర్వసత్తాక, స్వతంత్ర, ఐక్య, ఆచరణీయ పాలస్తీనా ఆవిర్భవించి, ఇజ్రాయిల్ తో శాంతియుతంగా మనుగడ సాగించాలని మేం ఆశిస్తున్నాం. ఈ రోజు ప్రెసిండెంట్ శ్రీ అబ్బాస్ తో మేం సంభాషణ జరిపినప్పుడు ఈ విషయంలో మా వైఖరిని నేను పునరుద్ఘాటించాను.