అయోధ్యలో బాల రాముడి (శ్రీ రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

January 22nd, 05:12 pm

గౌరవనీయమైన వేదిక తో పాటు సాధువులు, ఋషులు అందరూ, ప్రపంచంలోని నలుమూలలో మనందరితో పాటు ఈ దివ్య కార్యక్రమం తో అనుసంధానమవుతున్న రామ భక్తులందరూ., మీ అందరికీ అభినందనలు, అందరికీ రామ్ రామ్.

అయోధ్య లోక్రొత్త గా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిర్ లో శ్రీ రామ్ లలా యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

January 22nd, 01:34 pm

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య లో క్రొత్త గా నిర్మించిన శ్రీ రామ్ జన్మభూమి మందిర్ లో ఈ రోజు న జరిగినటువంటి శ్రీ రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీ రామ జన్మభూమి మందిరం నిర్మాణం లో తోడ్పాటు ను అందించిన శ్రమ జీవుల తో శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

January 21st, 03:42 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభమైన ప్రదేశాన్ని సందర్శించారు.

2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 18th, 11:30 am

మిత్రులారా!ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని చాలా మంది అంటారు. చాలా మంది 'మన్ కీ బాత్' శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశానని చాలా మంది రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్పబలం చూసినప్పుడుపొంగిపోతాను. అతిపెద్ద లక్ష్యం కావచ్చు, కష్టమైన సవాలు కావచ్చు- భారతదేశ ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి. రెండు-మూడు రోజుల క్రితందేశ పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జాయ్ తుఫాను కచ్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాతకచ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకుంటున్నారు. కచ్‌లో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢీ బీజ్‌ను జరుపుకుంటారు. నేను చాలా సంవత్సరాలుగా కచ్‌కి వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి. బైపర్‌జోయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.