ఎర్రకోట వద్ద పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం

January 23rd, 06:31 pm

కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు కిషన్ రెడ్డి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, మీనాక్షి లేఖి గారు, అజయ్ భట్ గారు, బ్రిగేడియర్ ఆర్ ఎస్ చికారా గారు, ఐఎన్ఎ వెటరన్ లెఫ్టినెంట్ ఆర్ మాధవన్ గారు, ప్రియమైన నా దేశప్రజలారా!

ఢిల్లీ ఎర్రకోట వద్ద పరాక్రమ్‌ దివస్‌ ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.

January 23rd, 06:30 pm

ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు , ఢల్లీిలోని ఎర్రకోటవద్ద జరిగిన పరాక్రమ్‌ దివస్‌ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి భారత్‌ పర్వ్‌ ను ప్రారంభించారు. ఇందులో దేశ సుసంపన్న వైవిధ్యతను రిపబ్లిక్‌ దినోత్సవ శకటాలను, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. నేషనల్‌ ఆర్కైవ్స్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పై ఫోటోలు, పెయింటింగ్స్‌, పుస్తకాలు, శిల్పాలతో కూడిన సాంకేతికత ఆధారిత ఇంటరాక్టివ్‌ ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి తిలకించారు. నేతాజీ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా వారు నేతాజీ జీవితంపై ప్రదర్శించిన డ్రామాను ప్రధానమంత్రి తిలకించారు. ఐఎన్‌ఎ కి సంబంధించి జీవించి ఉన్న ఏకైక ప్రముఖుడు లెఫ్టినెంట్‌ ఆర్‌.మాధవన్‌ ను ప్రధానమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. పరాక్రమ్‌దివస్‌ను 2021 నుంచి నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి రోజు జరుపుకుంటున్నారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖులను గౌరవించుకోవాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరాక్రమ్‌ దివస్‌ను పాటిస్తున్నారు.

ప్రాణ ప్రతిష్ఠ వేడుక నేపథ్యంలో రామజ్యోతిని వెలిగించండి: పౌరులకు ప్రధాని పిలుపు

January 22nd, 06:23 pm

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా రామజ్యోతిని వెలిగించి, శ్రీ రామ్ లల్లాకు స్వాగతం పలకాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు.