ప్రముఖ స్క్వాష్ క్రీడాకారుడు శ్రీ రాజ్ మన్‌చందా కన్నుమూత ప్రధానమంత్రి సంతాపం

December 04th, 03:42 pm

ప్రముఖ స్క్వాష్ క్రీడాకారుడు శ్రీ రాజ్ మన్‌చందా ఈ రోజు మరణించారు. దీనిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ రాజ్ మన్‌చందా సిసలైన భారతీయ స్క్వాష్ దిగ్గజం. అంకితభావం, ప్రావీణ్యం కలిగిన క్రీడాకారునిగా ఆయన ప్రసిద్ధి చెందారంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. శ్రీ మన్‌చందా సైన్యంలో పనిచేసి దేశానికి సేవలందించారంటూ ప్రధాని కొనియాడారు.