రాజ్యాంగమే మనకు మార్గదర్శకం: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

December 29th, 11:30 am

మన్ కీ బాత్ యొక్క ఈ ఎపిసోడ్‌లో, రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవం మరియు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ సన్నాహాలతో సహా భారతదేశం సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రతిబింబించారు. బస్తర్ ఒలింపిక్స్ విజయాన్ని ఆయన ప్రశంసించారు మరియు ఆయుష్మాన్ భారత్ పథకం కింద మలేరియా నిర్మూలన మరియు క్యాన్సర్ చికిత్సలో పురోగతి వంటి ముఖ్యమైన ఆరోగ్య పురోగతులను హైలైట్ చేశారు. అదనంగా, ఒడిశాలోని కలహండిలో వ్యవసాయ పరివర్తనను ఆయన ప్రశంసించారు.

దిగ్గజ నటుడు రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని

December 14th, 11:17 am

దిగ్గజ నటుడు శ్రీ రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. ఆయన దూరదృష్టి గల సినీ రూపకర్త, నటుడు, వెండితెర సార్వభౌముడనీ ప్రధాని కొనియాడారు. శ్రీ రాజ్ కపూర్ చిత్ర దర్శకుడు మాత్రమే కాదని భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సాంస్కృతిక రాయబారిగా వర్ణిస్తూ, అనేక తరాలపాటు సినిమా దర్శకులు, నటులు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని శ్రీ మోదీ అన్నారు.

రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా కపూర్ కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి సంభాషణ

December 11th, 09:00 pm

మిమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ గారూ లేదా ప్రధాన మంత్రి గారూ.. ఈ రెండు సంబోధనల్లో ఎలా పలకరించాలంటూ గత వారం రోజులుగా మేం మా వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులో పెద్ద ఎత్తున చర్చించుకున్నాం. రీమా అత్త రోజూ నాకు ఫోన్ చేసి ఏమని పలకరిద్దాం రా, ఈ విషయంలో ఎలా ముందుకు పోదాం... చెప్పవేంరా.. అంటూ ఒకటే ప్రశ్నలు వేసేది.

దిగ్గజ నటుడు శ్రీ రాజ్ కపూర్ శతజయంతి ఉత్సవాలు త్వరలో జరుగనుండగా

December 11th, 08:47 pm

మనం దిగ్గజ నటుడు శ్రీ రాజ్ కపూర్ శత జయంతిని ఒక ఉత్సవంలా జరుపుకోనున్న తరుణంలో కపూర్ కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మనసారా మాట్లాడారు. ఈ ప్రత్యేక సమావేశం భారతీయ చలనచిత్ర రంగానికి శ్రీ రాజ్ కపూర్ అందించిన అనన్య సేవలతోపాటు చిరస్థాయిగా నిలిచే ఆయన వారసత్వాన్ని సైతం సమ్మానించేదిగా ఉంది. ఈ సందర్భంగా కపూర్ కుటుంబ సభ్యులతో ప్రధాని అరమరికలు లేకుండా మాట్లాడారు.