మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళి

October 02nd, 03:43 pm

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు.

2023 వ సంవత్సరం సెప్టెంబర్ 24 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 105 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

September 24th, 11:30 am

నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం! 'మన్ కీ బాత్' మరొక భాగంలో దేశం సాధించిన విజయాలను, దేశప్రజల విజయాలను, వారి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని మీతో పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈ రోజుల్లో నాకు వచ్చిన ఉత్తరాలు, సందేశాలు చాలా వరకు రెండు విషయాలపై ఉన్నాయి. మొదటి అంశం చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడం, రెండవ అంశం ఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడం. దేశంలోని ప్రతి ప్రాంతం నుండి, సమాజంలోని ప్రతి వర్గం నుండి, అన్ని వయసుల వారి నుండి నాకు లెక్కపెట్టలేనన్ని లేఖలు వచ్చాయి. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై దిగే సంఘటనలో ప్రతి క్షణాన్ని కోట్లాది మంది ప్రజలు వివిధ మాధ్యమాల ద్వారా ఏకకాలంలో చూశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యూట్యూబ్ లైవ్ ఛానెల్‌లో 80 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సంఘటనను వీక్షించారు. అందులోనే ఇదొక రికార్డు. చంద్రయాన్-3తో కోట్లాది మంది భారతీయుల అనుబంధం ఎంత గాఢంగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. చంద్రయాన్ సాధించిన ఈ విజయంపై దేశంలో చాలా అద్భుతమైన క్విజ్ పోటీ జరుగుతోంది. ఈ ప్రశ్నల పోటీకి 'చంద్రయాన్-3 మహాక్విజ్' అని పేరు పెట్టారు. మై గవ్ పోర్టల్‌ ద్వారా జరుగుతున్న ఈ పోటీలో ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. మై గవ్ పోర్టల్ ను ప్రారంభించిన తర్వాత రూపొందించిన క్విజ్‌లలో పాల్గొన్నవారి సంఖ్యాపరంగా ఇదే అతిపెద్దది. మీరు ఇంకా ఇందులో పాల్గొనకపోతే ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇంకా కేవలం ఆరు రోజుల గడువే మిగిలి ఉంది. ఈ క్విజ్‌లో తప్పకుండా పాల్గొనండి.

రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి జి-20 దేశాధినేతల నివాళి

September 10th, 12:26 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహా జి-20 సభ్య దేశాల అధినేతలు ఇవాళ న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీజీ ప్రబోధించిన నిత్యాచరణీయ ఆదర్శాలు సామరస్యపూర్వక, సమగ్ర, సుసంపన్న ప్రపంచ భవిష్యత్తు నిర్మానం దిశగా మన సామూహిక దృక్పథాన్ని నిర్దేశిస్తాయని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.