Joint Statement: 2nd India-Australia Annual Summit

November 19th, 11:22 pm

PM Modi and Anthony Albanese held the second India-Australia Annual Summit during the G20 Summit in Rio de Janeiro. They reviewed progress in areas like trade, climate, defence, education, and cultural ties, reaffirming their commitment to deepen cooperation. Both leaders highlighted the benefits of closer bilateral engagement and emphasized advancing the Comprehensive Economic Cooperation Agreement (CECA) to strengthen trade and investment ties.

వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు

September 22nd, 12:06 pm

సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.

సమాచార పట్టిక: ఇండో-పసిఫిక్‌లో క్యాన్సర్‌ను ‌తగ్గించడానికి క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన క్వాడ్ దేశాలు

September 22nd, 12:03 pm

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో క్యాన్సర్‌ను అంతం చేయటంలో పురోగతి సాధించేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని క్వాడ్ దేశాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ప్రధాన ఆరోగ్య సంక్షోభంగా కొనసాగుతున్న, చాలావరకు నివారించదగిన వ్యాధి అయిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఈ కార్యక్రమం పనిచేయనుంది. ఈ ఒక్క రకం క్యాన్సర్‌తో మొదలైన ఈ కార్యకమం ఇతర క్యాన్సర్‌ల సమస్యను కూడా పరిష్కరించేందుకు పునాది వేయనుంది. క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న విస్తృత నిర్ణయాల్లో ఈ కార్యక్రమం ఒకటిగా ఉంది.

ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా

September 22nd, 12:00 pm

అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.

విల్మింగ్టన్ డిక్లరేషన్‌పై ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా నేతల సంయుక్త ప్రకటన

September 22nd, 11:51 am

ఈరోజు, అమెరికా అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .

న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోదీ

September 22nd, 11:19 am

డెలావేర్‌లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఫలవంతంగా ముగించుకుని, కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. నగరంలో జరిగే కమ్యూనిటీ ప్రోగ్రామ్ మరియు 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' వంటి వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు.

ఆస్ట్రేలియా ప్ర‌ధాన మంత్రితో శ్రీ నరేంద్ర మోదీ భేటీ

September 22nd, 07:16 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్ర‌ధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్‌లు అమెరికాలోని విల్మింగ్టన్‌లో 6వ క్వాడ్ నేతల సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. 2022 మే నుంచి వీరిద్దరూ వ్యక్తిగతంగా కలవడం ఇది తొమ్మిదోసారి.

జపాన్ ప్రధాన మంత్రి శ్రీ ఫ్యూమియో కిషిదాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

September 22nd, 06:01 am

అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబర్ 21న డెలావర్ లోని విల్మింగ్టన్ లో క్వాడ్ సమావేశాల సందర్భంగా జపాన్ ప్రధాన మంత్రి శ్రీ ఫ్యూమియో కిషిదాతో భేటీ అయ్యారు.

డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఆరో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

September 22nd, 05:21 am

ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబ‌ర్ 21న డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జ‌రిగిన ఆరో క్వాడ్ నేత‌ల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఫుమియో కిషిదా పాల్గొన్నారు.

A free, open, inclusive and prosperous Indo-Pacific is our shared priority and commitment: PM Modi

September 22nd, 02:30 am

In his address at the QUAD Summit, PM Modi underscored the alliance's significant progress since 2021 under President Biden's leadership, highlighting its crucial role in promoting a rules-based international order, respect for sovereignty, and peaceful conflict resolution amidst global tensions. He reaffirmed QUAD’s shared commitment to a free, open, inclusive, and prosperous Indo-Pacific. PM Modi also announced that India will host the QUAD Leaders' Summit in 2025.

డెలావర్ లోని విల్మింటన్ లో అమెరికా అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం

September 22nd, 02:02 am

భారత్ అమెరికాల భాగస్వామ్యానికి ముందుకు తీసుకుపోవడంలో అధ్యక్షుడు శ్రీ బైడెన్ అసమానమైన సేవలను అందించారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందలు తెలిపారు. అమెరికాలో 2023 జూన్ లో తాను పర్యటించడాన్ని, అదే సంవత్సరం సెప్టెంబరు నెలలో భారతదేశంలో జరిగిన జి-20 నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి అధ్యక్షుడు శ్రీ బైడెన్ భారత్ కు రావడాన్ని శ్రీ మోదీ ఆప్యాయంగా గుర్తు చేశారు. ఈ పర్యటనలు భారత్- అమెరికా భాగస్వామ్యాన్ని ఉపయోగకరంగా మార్చాయనీ, తగిన వేగాన్నీ అందించాయనీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఫిలడెల్ఫియా చేరుకున్న ప్రధాని మోదీ

September 21st, 09:16 pm

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలోని ఫిలడెల్ఫియా చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలికారు. ప్రధానమంత్రి ప్రయాణంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ద్వైపాక్షిక సమావేశం, అలాగే డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కూడా ఉన్నాయి.

అమెరికా పర్యటనకు ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన

September 21st, 04:15 am

అధ్యక్షుడు బైడెన్ తన స్వస్థలం విల్మింగ్టన్ లో నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి, న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తుకు సంబంధించిన శిఖరాగ్ర సమావేశం (సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ ) లో ప్రసంగించడానికి నేను మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు బయలుదేరుతున్నాను.

సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

September 19th, 03:07 pm

ప్రధాని మోదీ 21-23 సెప్టెంబర్ 2024 సమయంలో యూఎస్ సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రధాని డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో నాల్గవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సెప్టెంబరు 23న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రధాని ప్రసంగిస్తారు.

భారత, అమెరికా ఉమ్మడి ప్రకటన

September 08th, 11:18 pm

భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్వాగతం పలికారు. భారత, అమెరికా దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ఇద్దరు నేతలు తిరిగి ధ్రువీకరించారు. 2023 జూన్ లో ప్రధానమంత్రి శ్రీ మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న చారిత్రక విజయాల అమలులో సాగుతున్న పురోగతిని ఉభయులు ప్రశంసించారు.

ప్రధాన మంత్రి యుఎస్ఎ కు మరియు ఈజిప్టు కు తనయాత్రార్థం బయలుదేరి వెళ్ళే కంటే ముందుగా జారీ చేసిన ప్రకటన

June 20th, 07:00 am

అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ మరియు ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ గారు లు ఆహ్వానించిన మీదట నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల కు ఆధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరి వెళుతున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం మన ఉభయ ప్రజాస్వామ్య దేశాల మధ్య నెలకొన్న భాగస్వామ్యం యొక్క శక్తి కి మరియు కీలకత్వాని కి అద్దం పడుతున్నది.

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రితో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం

May 24th, 06:41 am

ఆస్ట్రేలియా పర్యటనలో నాకు, నా ప్రతినిధి బృందానికి ఇచ్చిన ఆతిథ్యం, గౌరవానికి ఆస్ట్రేలియా ప్రజలకు, ప్రధాని అల్బనీస్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు, ప్రధాన మంత్రి (ఆస్ట్రేలియా) అల్బనీస్ భారత పర్యటనకు వచ్చిన రెండు నెలల్లోనే నేను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాను. గత ఏడాది కాలంలో మా భేటీ ఇది ఆరోసారి.

ఎఫ్ ఐపిఐసి 3 సదస్సులో ప్రధాన మంత్రి ముగింపు ప్రకటన

May 22nd, 04:33 pm

మీ అభిప్రాయాలకు ధన్యవాదములు. మా చర్చల నుంచి వచ్చిన ఆలోచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. పసిఫిక్ ద్వీప దేశాల కొన్ని భాగస్వామ్య ప్రాధాన్యతలు, అవసరాలను మేము కలిగి ఉన్నాము. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలన్నదే మా ప్రయత్నం. FIPICలో మా సహకారాన్ని మరింత పెంపొందించడానికి, నేను కొన్ని ప్రకటనలు చేయాలనుకుంటున్నాను:

మూడవ ఎఫ్ ఐ పి ఐ సి సమ్మిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ ప్రకటన తెలుగు l అనువాదం

May 22nd, 02:15 pm

మూడవ ఎఫ్ఐపిఐసి శిఖరాగ్ర సమావేశానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం! ప్రధాన మంత్రి జేమ్స్ మరాప్ నాతో కలిసి ఈ సదస్సుకు సహ ఆతిథ్యం ఇస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. పోర్ట్ మోరెస్బీలో ఇక్కడ సమ్మిట్ కోసం చేసిన అన్ని ఏర్పాట్లకు గానూ నేను ఆయనకు , వారి బృందానికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను..

క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ వ్యాఖ్యల తెలుగు అనువాదం

May 20th, 05:16 pm

ఈ రోజు నా స్నేహితులతో కలిసి ఈ క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలకు భరోసా కల్పించడానికి క్వాడ్ గ్రూప్ ఒక ముఖ్యమైన వేదికగా స్థిరపడింది. ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వాణిజ్యం, ఆవిష్కరణలు, వృద్ధికి చోదకశక్తి అనడంలో సందేహం లేదు. ఇండో-పసిఫిక్ భద్రత, విజయం ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికి చాలా ముఖ్యం. నిర్మాణాత్మక ఎజెండాతో, భాగస్వామ్య ప్రజాస్వామిక విలువల ఆధారంగా ముందుకు సాగుతున్నాం.