సమాచార పట్టిక: ఇండో-పసిఫిక్‌లో క్యాన్సర్‌ను ‌తగ్గించడానికి క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన క్వాడ్ దేశాలు

September 22nd, 12:03 pm

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో క్యాన్సర్‌ను అంతం చేయటంలో పురోగతి సాధించేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని క్వాడ్ దేశాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ప్రధాన ఆరోగ్య సంక్షోభంగా కొనసాగుతున్న, చాలావరకు నివారించదగిన వ్యాధి అయిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఈ కార్యక్రమం పనిచేయనుంది. ఈ ఒక్క రకం క్యాన్సర్‌తో మొదలైన ఈ కార్యకమం ఇతర క్యాన్సర్‌ల సమస్యను కూడా పరిష్కరించేందుకు పునాది వేయనుంది. క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న విస్తృత నిర్ణయాల్లో ఈ కార్యక్రమం ఒకటిగా ఉంది.

క్వాడ్ నేతల క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

September 22nd, 06:25 am

ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు నేను నా హృదయపూర్వక అభినందనలను తెలియ జేస్తున్నాను. తక్కువ ఖర్చులో సమాజంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలన్న మన అందరి నిబద్ధతకు ఇది అద్దం పడుతున్నది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ‘‘క్వాడ్ టీకా మందు’’ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. మరి ఇక్కడ క్వాడ్ (QUAD)లో గర్భాశయ ముఖద్వారు క్యాన్సర్ వంటి సవాలుకు పరిష్కారాన్ని వెతకాలని మనమంతా కలసి నిర్ణయించాం.

ప్ర‌తిష్టాత్మ‌క‌ క్వాడ్ క్యాన్స‌ర్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన‌మంత్రి

September 22nd, 06:10 am

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ... గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌ను గుర్తింపు, చికిత్స, నిర్మూలన ల‌క్ష్యంతో అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ చేప‌ట్టిన ఈ ఆలోచ‌నాత్మ‌క చొర‌వ‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు. ఇండో-ప‌సిఫిక్ దేశాల ప్ర‌జ‌ల‌కు అందుబాటులో స‌ర‌స‌మైన‌, నాణ్య‌మైన వైద్య సంర‌క్ష‌ణ అందించేందుకు ఈ కార్య‌క్ర‌మం ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. భార‌త్ సైతం దేశంలో గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌ నిర్ధార‌ణ‌కు సామూహిక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. భార‌త్ చేప‌డుతున్న ఆరోగ్య భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌పై ఆయ‌న మాట్లాడుతూ.. గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌కు టీకాను దేశం అభివృద్ధి చేసింద‌ని, ఈ వ్యాధికి కృత్రిమ మేధ ఆధారిత చికిత్స విధానానికి కృషి చేస్తున్న‌ద‌ని పేర్కొన్నారు.

డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఆరో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

September 22nd, 05:21 am

ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబ‌ర్ 21న డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జ‌రిగిన ఆరో క్వాడ్ నేత‌ల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఫుమియో కిషిదా పాల్గొన్నారు.