బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ

August 13th, 11:31 am

మీ అందరితో ప్రత్యక్షం గా మాట్లాడడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది కానీ అందరితో మాట్లాడడం సాధ్యం కాదు. కానీ మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. లేదా ఏదైనా సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నా ఇంటికి కుటుంబ సభ్యుడిలా రావడానికి సమయం కేటాయించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు సాధించిన విజయాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ విషయంలో మీతో సహకరించగలిగినందుకు నేను కూడా గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 భారత బృందానికి ప్రధానమంత్రి సత్కారం

August 13th, 11:30 am

కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)-2022లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో సత్కరించారు. వివిధ క్రీడల్లో పోటీపడిన క్రీడాకారులు, వారి శిక్షకులతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలు, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన ఈ క్రీడలలో భారతదేశానికి వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు లభించాయి. ఈ మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను ప్రధానమంత్రి అభినందించారు. సీడబ్ల్యూజీ-2022లో క్రీడాకారుల, శిక్షకుల ప్రతిభా ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సాధించిన విజయాలు తమకు గర్వకారణమని అభివర్ణించారు. క్రీడాకారుల అద్భుత కృషి వల్ల దక్కిన అద్భుత విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రవేశించడం గర్వించదగిన అంశమని ప్రధాని పేర్కొన్నారు.

కామన్ వెల్థ్ గేమ్స్ 2022లో బాడ్ మింటన్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకుపి.వి. సింధు గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

August 08th, 03:56 pm

బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో బాడ్ మింటన్ లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు పి.వి. సింధు గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

పి.వి. సింధు గారి ని ఆమె తొలిసారిగా సింగపూర్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకొన్నందుకు అభినందించిన ప్రధాన మంత్రి

July 17th, 03:08 pm

పి.వి. సింధు గారు తొలి సారి గా సింగపూర్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకొన్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందన లు తెలిపారు. ఇది దేశానికి ఒక గర్వకారణమైన ఘడియ అని, అంతేకాకుండా వృద్ధిలోకి వస్తున్నటువంటి క్రీడాకారుల కు ఇది ప్రేరణ ను కూడా అందించగలదని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఏస్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రధాని మోదీ ప్రశంసలు తనకు ఎలా స్ఫూర్తినిచ్చాయనే దాని గురించి మాట్లాడింది

March 29th, 01:51 pm

పివి సింధు, ఒక వీడియోలో, ప్రధాని నరేంద్ర మోదీ యొక్క నిరంతర మద్దతు మరియు ప్రశంసలు దేశం కోసం మరిన్ని చేయడానికి తనకు ఎలా ప్రేరణగా నిలిచాయో గుర్తుచేసుకుంది. 2021లో టోక్యో ఒలింపిక్స్‌కు ముందు మరియు తర్వాత అలాగే పద్మభూషణ్ అందుకున్నప్పుడు ప్రధాని మోదీతో తన సమావేశాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు మరియు వాటిని 'అత్యంత చిరస్మరణీయం' అని పేర్కొన్నారు.

స్విస్ఓపన్ 2022 లో గెలిచిన భారతీయ శట్ లర్ పి.వి. సింధు గారి కి అభినందనలు తెలిపినప్రధాన మంత్రి

March 27th, 10:38 pm

స్విస్ ఓపన్ 2022 లో గెలుపు ను సాధించిన భారతీయ బాడ్ మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

టోక్యో ఒలింపిక్స్ 2020 లో బాడ్ మింటన్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు పి.వి. సింధు కు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి

August 01st, 08:12 pm

టోక్యో ఒలింపిక్స్ 2020 లో బాడ్ మింటన్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు పి.వి. సింధు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆమె భారతదేశానికి గౌరవం గా నిలచారని, ఆమె మన అత్యంత శ్రేష్ఠ ఒలింపిక్ క్రీడాకారుల లో ఒకరని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న భారత అథ్లెట్లతో వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

July 13th, 05:02 pm

మీ అందరితో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది. నేను మీలో ప్రతీ ఒక్కరితో విడివిడిగా మాట్లాడలేకపోయినా దేశ ప్రజలందరూ మీలో పొంగుతున్న ఉత్సాహాన్ని, ఉత్సుకతను చూస్తూనే ఉన్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం వరకు మీ అందరి కోసం క్రీడా శాఖ మంత్రిగా ఎంతో కృషి చేసిన ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజెజు జీ కూడా ఉన్నారు. అమిత యువకుడైన శ్రీ నిశిత్ ప్రామాణిక్ క్రీడల శాఖ సహాయమంత్రిగా ప్రస్తుతం మా బృందంలో ఉన్నారు. అన్ని క్రీడా సంఘాల అధిపతులు, సభ్యులు, నా సహచరులు, టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న క్రీడాకారులు, వారి కుటుంబాలు అందరితో ఈ వర్చువల్ సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నాం. వాస్తవానికి మీ అందరికీ ఇక్కడ నా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది, కాని ఈ సారి వర్చువల్ గా మాత్రమే కలవగలుగుతున్నాను. గతంలో అలాగే ఆతిథ్యం ఇచ్చే వాడిని. అలాంటి సందర్భాలు నాకు చిరస్మరణీయంగా ఉండేవి. కాని కరోనా కారణంగా ఈ సారి అది సాధ్యం కావడంలేదు. మన క్రీడాకారుల్లో సగం మందికి పైగా ఇప్పటికే విదేశాల్లో శిక్షణ పొంది ఉన్నారు. మీరు తిరిగి వచ్చినప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని కలవగలనని హామీ ఇస్తున్నాను. కరోనా పరిస్థితులను ఎంతో మార్చింది. దాని ప్రభావం వల్ల ఒలింపిక్స్ నిర్వహించే సంవత్సరం, ఒలింపిక్స్ కు మీరు తయారయ్యే తీరుతెన్నులు...ఇలా అన్నీ ఎంతగానో మారిపోయాయి. ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. టోక్యోలో కూడా గతంలో ఎన్నడూ లేని భిన్నత్వాన్ని మీరు చూడబోతున్నారు.

మనమందరం # చీర్ 4 ఇండియా: ప్రధాని మోదీ

July 13th, 05:01 pm

టోక్యో ఒలింపిక్స్‌కు కట్టుబడి ఉన్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. అనధికారిక మరియు ఆకస్మిక పరస్పర చర్యలో, ప్రధాన మంత్రి అథ్లెట్లను ప్రేరేపించారు మరియు వారి త్యాగానికి వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి సంభాషణ

July 13th, 05:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత క్రీడాకారుల బృందంతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. ఈ క్రీడల్లో వారు పాల్గొనబోతున్న నేపథ్యంలో వారిలో ఉత్తేజం నింపే కృషిలో భాగంగా ప్రధానమంత్రి వారితో ముచ్చటించారు. కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌, సహాయమంత్రి శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌, న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 28th, 11:30 am

2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

బిడబ్ల్యుఎఫ్ చాంపియన్ శిప్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్న పి.వి. సింధు కు అభినందనలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

August 25th, 08:50 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బిడబ్ల్యుఎఫ్ చాంపియన్ శిప్ లో విజేత గా నిలచి బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు పి.వి. సింధు ను అభినందించారు.