మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ప్రధానమంత్రి

November 21st, 09:57 pm

గయానాలోని జార్జ్ టౌన్ లో ఉన్న చారిత్రక విహారోద్యానవనంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. బాపూ బోధించిన శాంతి, అహింసా విలువలను గుర్తుచేసుకున్న ఆయన.. అవి మానవాళికి ఎప్పటికీ దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయన్నారు. గాంధీజీ శతజయంతి సందర్భంగా 1969లో ఆ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పారు.