అటల్ ఇన్నోవేషన్ మిషన్ పొడిగింపుకు మంత్రివర్గం ఆమోదం
April 08th, 09:16 pm
సమావేశ మైన కేంద్ర మంత్రివర్గం అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎఐఎం)ను 2023 మార్చి వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. దేశంలో ఒక సృజనాత్మక సంస్కృతి , వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యం పై ఎఐఎమ్ పనిచేస్తుంది. ఎఐఎమ్ వివిధ కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్య సాధన దిశగా పని చేస్తుంది.వెంచర్ కేపిటల్.. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ప్రతినిధులతో ప్రధానమంత్రి రౌండ్‌టేబుల్ చర్చాగోష్ఠి
December 17th, 08:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ లోక్‌కల్యాణ్ మార్గ్‌లో వెంచర్ కేపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ చర్చాగోష్ఠి నిర్వహించారు. దేశంలో పెట్టుబడుల వాతావరణం భారీగా పెరగడానికి ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ దిశగా గడచిన ఏడేళ్లలో ప్రభుత్వం అనేకానేక కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇదే అంశాలపై సమావేశంలో చర్చ కొనసాగింది. అలాగే తాజా బడ్జెట్ రూపకల్పనకు ముందు పరిశ్రమ ప్రముఖులతో ప్రధానమంత్రి ఏ విధంగా వ్యక్తిగత చర్చలు నిర్వహించారో ఈ చర్చాగోష్ఠి ప్రతిబింబించింది.