అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు
November 06th, 01:57 pm
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికాల మధ్య సమగ్ర అంతర్జాతీయ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సహకారాన్ని పునరుద్ధరించేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.అర్జెంటీనా లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచిన శ్రీ అల్బర్టో ఫర్నాండిజ్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
October 30th, 08:36 pm
అర్జెంటీనా లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో విజేత అయిన శ్రీ అల్బర్టో ఫర్నాండిజ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.మెక్సికో అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన సీనియర్ ఆండ్రెస్ మాన్యుఎల్ను అభినందించిన ప్రధాని మోదీ
July 02nd, 06:30 pm
మెక్సికో అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన సీనియర్ ఆండ్రెస్ మాన్యుఎల్ను ప్రధాని మోదీ అభినందించారు. మెక్సికోలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అతని విజయంపై సీనియర్ ఆండ్రెస్ మాన్యుఎల్కు నా అభినందనలు. ముచాస్ ఫెలిసిడేడిస్! ఇండియా-మెక్సికో ప్రివైలేడ్ సంబంధాలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఎదురుచూస్తున్నాను. అన్నారు.అధ్యక్ష ఎన్నికలలో శ్రీ పుతిన్ విజయం పట్ల ఆయనకు టెలిఫోన్ ద్వారా అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
March 19th, 08:40 pm
రష్యా లో నిన్న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ విజేతగా నిలచినందుకు గాను ఆయనను అభినందించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ లో శ్రీ పుతిన్ తో మాట్లాడారు. శ్రీ పుతిన్ కు ప్రధాన మంత్రి తన అభినందనలను తెలుపుతూ భారతదేశానికి, రష్యన్ ఫెడరేశన్ కు మధ్య నెలకొన్న ‘ప్రత్యేకమైన మరియు విశేషాధికారం కల వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం’ శ్రీ పుతిన్ నాయకత్వంలో మరింత బలోపేతం అయ్యే దిశగా పయనిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలోనే జరుగనున్న వార్షిక శిఖర సమ్మేళనానికై అధ్యక్షులు శ్రీ పుతిన్ ను భారతదేశానికి ఆహ్వానించేందుకు తాను ఎదురు చూస్తున్నానని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.భారత రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారికి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
July 20th, 05:26 pm
భారత రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు గాను శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారూ, మీరు భారత రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు అభినందనలు. మీ పదవీ కాలం ఫలప్రదంగాను, స్ఫూర్తిని ఇచ్చేదిగాను ఉండాలని కోరుకుంటున్నాను.సోషల్ మీడియా కార్నర్ 17 జూలై 2017
July 17th, 08:40 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!అందరం కలసికట్టుగా ఎదగాలనే జిఎస్ టి చెబుతోంది. జిఎస్ టి స్ఫూర్తే ఈ సమావేశాల నిండా వ్యాపిస్తుందని ఆశిస్తున్నాను: ప్రధాన మంత్రి
July 17th, 10:40 am
నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. వేసవి కాలం ముగిసిన తరువాత, తొలకరి జల్లులు నేలకు సరి కొత్త పరిమళాన్ని అద్దుతాయి. అలాగే, జిఎస్ టి విజయవంతంగా అమలైన అనంతరం వస్తున్న ఈ వర్షాకాల సమావేశాలు కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి.