Maha Kumbh is a divine festival of our faith, spirituality and culture: PM in Prayagraj

December 13th, 02:10 pm

PM Modi inaugurated development projects worth ₹5500 crore in Prayagraj, highlighting preparations for the 2025 Mahakumbh. He emphasized the cultural, spiritual, and unifying legacy of the Kumbh, the government's efforts to enhance pilgrimage facilities, and projects like Akshay Vat Corridor and Hanuman Mandir Corridor.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం

December 13th, 02:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యే వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, పవిత్ర సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్‌కు, మహాకుంభమేళాకు వచ్చే సాధువులు, సన్యాసులకు భక్తితో నమస్కరించారు. కృషి, అంకితభావంతో మహా కుంభమేళాను విజయవంతం చేస్తున్న ఉద్యోగులు, శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా జరిగే పరిమాణాన్ని, స్థాయి గురించి వివరిస్తూ, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే మహాయజ్ఞంగా, ప్రతి రోజూ లక్షల మంది భక్తుల పాల్గొనే, ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ‘‘ప్రయాగరాజ్ నేలపై సరికొత్త చరిత్ర లిఖితమవుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న మహా కుంభమేళా దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును నూతన శిఖరాలకు తీసుకెళుతుందతని, ఈ ఐక్యత ‘మహాయజ్ఞం’ గురించి ప్రపంచమంతా చర్చిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహా కుంభమేళాని విజయవంతంగా నిర్వహించాలన్నారు.

డిసెంబరు 13న ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన

December 12th, 02:10 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 13న ఉత్తరప్రదేశ్‌ను సందర్శించనున్నారు. ఆయన ప్రయాగ్‌రాజ్‌కు వెళ్ళి, మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాలకు సంగమ్ స్థలానికి చేరుకొని పూజ, దర్శనం కార్యక్రమాల్లో పాలుపంచుకొంటారు. మధ్యాహ్నం దాదాపు 12 గంటల 40 నిమిషాలకు అక్షయ వట వృక్షానికి పూజచేసి, ఆ తరువాత హనుమాన్ మందిర్, సరస్వతీ కూప్‌లో దర్శనం, పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఇంచుమించు ఒంటిగంటన్నరకు ఆయన మహాకుంభ్ ప్రదర్శన స్థలాన్ని చేరుకొని, ఆ ప్రదేశమంతా కలియతిరుగుతారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత, మధ్యాహ్నం సుమారు 2 గంటలకు రూ. 5500 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభిస్తారు.

భారతీయ రైల్వేలకు చెందిన మూడు మల్టీట్రాక్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోద ముద్ర:

November 25th, 08:52 pm

సుమారు రూ.7,927 కోట్ల ఖర్చుతో రైల్వేల మంత్రిత్వ శాఖ తలపెట్టిన మూడు ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఈ రోజు ఆమోదాన్ని తెలిపింది.

గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

November 22nd, 03:02 am

మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

గయానాలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం గయానాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాలను ప్రభావితం చేస్తూ గయానా అభివృద్ధికి దోహదపడ్డారు: ప్రధానమంత్రి

November 22nd, 03:00 am

గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.

India is now identified by its expressways and high-tech infrastructure: PM Modi in Prayagraj, UP

May 21st, 04:00 pm

Prime Minister Narendra Modi addressed a huge public gathering in Prayagraj, emphasizing the cultural and spiritual significance of the region, highlighting the progress made under his government, and drawing sharp contrasts with previous administrations.

PM Modi addresses a public meeting in Prayagraj, Uttar Pradesh

May 21st, 03:43 pm

Prime Minister Narendra Modi addressed a huge public gathering in Prayagraj, emphasizing the cultural and spiritual significance of the region, highlighting the progress made under his government, and drawing sharp contrasts with previous administrations.

Transformation of Indian Railways is the guarantee of Viksit Bharat: PM Modi

March 12th, 10:00 am

PM Modi dedicated to the nation and laid the foundation stone of various developmental projects worth over Rs 1,06,000 crores at Dedicated Freight Corridor’s Operation Control Centre in Ahmedabad, Gujarat. He added that in the 75 days of 2024, projects worth more than Rs 11 lakh crores have been inaugurated or foundation stones laid while projects worth Rs 7 lakh crores have been unveiled in the last 10-12 days.

గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో రూ.1,06,000 కోట్లకుపైగా విలువైన

March 12th, 09:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌లోని ప్రత్యేక రవాణా కారిడార్ (డిఎఫ్‌సి) కార్యకలాపాల నియంత్రణ కేంద్రం ప్రాంగణంలో రూ.1,06,000 కోట్లకుపైగా విలువైన ప్రగతి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో రైల్వే మౌలిక సదుపాయాలు సహా అనుసంధానం, పెట్రో రసాయనాల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్యక్రమాలతోపాటు 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 200కుపైగా ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాలతో మమేకమైన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నేటి ఈ కార్యక్రమం స్థాయి, పరిణామం రైల్వేల చరిత్రలో మునుపెన్నడూ ఎరుగనిదని ప్రధాని అభివర్ణించారు. దీనికి సంబంధించి రైల్వే రంగానికి అభినందనలు తెలిపారు.

Uttar Pradesh decides the politics as well as the direction of the country's development: PM

March 10th, 12:15 pm

Prime Minister Narendra Modi inaugurated, dedicated and laid the foundation stone of multiple development initiatives worth more than Rs 34,000 crores in an event at Azamgarh Uttar Pradesh. Speaking on the occasion, the Prime Minister noted the change of such a programme happening in places like Azamgarh instead of being held in Delhi. Azamgarh, which was counted among the backward areas, is writing a new chapter of development today,” PM Modi said.

అజంగఢ్‌లో రూ.34,000 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

March 10th, 11:49 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని అజంగ‌ఢ్‌లో రూ.34,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఢిల్లీలో కాకుండా అజంగ‌ఢ్ వంటి ప్రాంతంలో నిర్వహించడంలోని ప్రాధాన్యాన్నిప్ర‌ధానమంత్రి ప్రస్తావించారు. ‘‘ఒకనాడు వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడిన ఈ ప్రాంతం నేడు సరికొత్త ప్రగతి అధ్యాయాన్ని లిఖిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే ఈ రోజున రూ.34,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ఇక్కడ ప్రారంభోత్సవం.. శంకుస్థాపన.. జాతికి అంకితం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

మన్ కి బాత్, డిసెంబర్ 2023

December 31st, 11:30 am

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని వినేటటువంటి వారు అనేకులు నాకు లేఖల ను వ్రాసి వారి యొక్క స్మరణీయమైనటువంటి క్షణాల ను గురించి నాకు తెలియజేశారు. ఈ సంవత్సరం లో, మన దేశం అనేక ప్రత్యేకమైనటువంటి సాఫల్యాల ను సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరం లోనే. భారతదేశం 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ఉత్తరాల ను వ్రాశారు. జి- 20 శిఖర సమ్మేళనం సఫలం అయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. సహచరులారా, ఈ రోజు న భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసం తో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తి తో, స్వావలంబన భావన తో నిండి ఉంది. అదే స్ఫూర్తి ని, ఊపును 2024 లో కూడాను మనం కొనసాగించాలి. దీపావళి రోజు న రికార్డు స్థాయి లో జరిగినటువంటి వ్యాపార లావాదేవీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానికం గా తయారైన ఉత్పాదనల నే ఆదరించాలి) అనే మంత్రాని కి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి.

న్యూ ఢిల్లీలో కర్తవ్య పథ్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

September 08th, 10:41 pm

నేటి ఈ చారిత్రాత్మక కార్యక్రమంపై దేశం మొత్తం ఒక దృష్టిని కలిగి ఉంది, ఈ సమయంలో దేశప్రజలందరూ ఈ కార్యక్రమంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూస్తున్న దేశప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ చారిత్రాత్మక సమయంలో, నా క్యాబినెట్ సహచరులు శ్రీ హర్దీప్ పూరీ జీ, శ్రీ జి కిషన్ రెడ్డి జీ, శ్రీ అర్జున్‌రామ్ మేఘవాల్ జీ, శ్రీమతి మీనాక్షి లేఖి జీ, శ్రీ కౌశల్ కిషోర్ జీ కూడా ఈ రోజు నాతో పాటు వేదికపై ఉన్నారు. దేశంలోని అనేక మంది ప్రముఖులు, వారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు.

PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate

September 08th, 07:00 pm

PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.

PM Modi addresses public meetings in Amethi and Prayagraj, Uttar Pradesh

February 24th, 12:32 pm

Prime Minister Narendra Modi today addressed public meetings in Uttar Pradesh’s Amethi and Prayagraj. PM Modi started his address by highlighting that after a long time, elections in UP are being held where a government is seeking votes based on development works done by it, based on works done in the interest of the poor and based on an improved situation of Law & Order.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘన వ్యర్థాల ఆధారిత గోబర్-ధన్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

February 19th, 04:27 pm

ఇండోర్‌లో గోబర్-ధన్ (బయో-సిఎన్‌జి) ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గత ఏడేళ్లలో ప్రభుత్వం సమస్యలకు త్వరితగతిన తాత్కాలిక పరిష్కారాలకు బదులుగా శాశ్వత పరిష్కారాలను అందించడానికి ప్రయత్నించిందని ప్రధాన మంత్రి చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ రెండో విడతలో వేల ఎకరాల భూమిని ఆక్రమించి అనేక రోగాలకు దారితీసే వాయు, నీటి కాలుష్యానికి కారణమవుతున్న లక్షల టన్నుల చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇండోర్‌లో మునిసిపల్ సాలిడ్ వేస్ట్ ఆధారిత గోబర్-ధన్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని

February 19th, 01:02 pm

ఇండోర్‌లో గోబర్-ధన్ (బయో-సిఎన్‌జి) ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గత ఏడేళ్లలో ప్రభుత్వం సమస్యలకు త్వరితగతిన తాత్కాలిక పరిష్కారాలకు బదులుగా శాశ్వత పరిష్కారాలను అందించడానికి ప్రయత్నించిందని ప్రధాన మంత్రి చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ రెండో విడతలో వేల ఎకరాల భూమిని ఆక్రమించి అనేక రోగాలకు దారితీసే వాయు, నీటి కాలుష్యానికి కారణమవుతున్న లక్షల టన్నుల చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Women self-help groups are champions of Atmanirbhar Bharat Abhiyan: PM Modi

December 21st, 04:48 pm

PM Modi visited Prayagraj and participated in a programme being held to empower women, especially at the grassroot level. The PM remarked that the security, dignity and respect ensured by the double-engine government for the women of UP is unprecedented. The women of Uttar Pradesh, the PM said, have decided that they will not allow the return of earlier circumstances.

ప్రయాగ్ రాజ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; లక్షల కొద్దీ మహిళ లు హాజరైన ఒక కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొన్నారు

December 21st, 01:04 pm

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, హిందీ సాహిత్య రంగం లో ప్రముఖుడు ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది కి ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించారు. ప్రయాగ్ రాజ్ అనేది వేల సంవత్సరాలుగా మన మాతృ శక్తి కి ఒక సంకేతం గా నిలచిన గంగ-యమున-సరస్వతి నదుల సంగమ స్థలంగా ఉండింది. ఈ రోజున ఈ ఈ తీర్థయాత్ర సంబంధి నగరం మహిళా శక్తి యొక్క అద్భుతమైన సమూహాన్ని తిలకిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.