ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ ద్వారా కోటి ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి వ్యవస్థల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయం
January 22nd, 07:42 pm
అయోధ్యలో సూర్యవంశ తిలకుడైన శ్రీరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరిగి ఢిల్లీకి రాగానే లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో నిర్వహించిన ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ కింద దేశంలోని కోటి ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంపై ప్రతిపాదనపై ఆమోదముద్ర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- కరెంటు బిల్లుల తగ్గింపుతోపాటు అవసరాల మేరకు విద్యుదుత్పాదన ద్వారా వారికి అసలైన స్వావలంబన కల్పించబడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అవసరాలకు పోగా మిగిలే విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పారు.‘ప్రధాన మంత్రిసూర్యోదయ యోజన’ లో భాగం గా ఒకకోటి కుటుంబాల కు ఇంటి పైకప్పు ల మీద రూఫ్ టాప్ సోలర్ సదుపాయం అందుబాటు లోకిరాగలదు
January 22nd, 07:38 pm
‘‘ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన’’ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఈ పథకం లో భాగం గా దేశం లో ఒక కోటి కుటుంబాల కు వారి యొక్క ఇంటి పై కప్పు మీద సౌర శక్తి అందుబాటు లోకి రాగలదు.